కేంద్రంలోని బీజేపీ పై ప్రజల్లో అసహనం.. అసంతృప్తి పెరిగిపోతోంది. పెట్రో ధరల పెంపు.. కరోనా వేళ ఏం చేయని మోడీ సర్కార్ పై జనాలు రగిలిపోతున్నారు. ఈ క్రమంలోనే ఈ అసంతృప్తి జ్వాలను క్యాష్ చేసుకునేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ సిద్ధమైంది. ఈ క్రమంలోనే రాష్ట్రాల్లో ప్రక్షాళన చేసి కాంగ్రెస్ పార్టీకి దూకుడు నేర్పేందుకు సమాయత్తమవుతోంది.
కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే విషయంలో రాహుల్ గాంధీ సమూల మార్పులు చేయాలని భావిస్తున్నాడట.. అన్ని రాష్ట్రాల్లో పార్టీని పరుగులు పెట్టించాలని డిసైడ్ అయ్యారట.. పంజాబ్ లో అమరీందర్ -సిద్దూ మధ్య విభేదాలను పరిష్కరించన పద్ధతిలోనే అన్ని రాష్ట్రాల్లో సమస్యలను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిష్కరిస్తోంది. రాజస్థాన్ వ్యవహారాన్ని కూడా రాహుల్ గాంధీ డైరెక్టుగా డీల్ చేయబోతున్నట్టు ప్రచారం సాగుతోంది.
ఈ నెలాఖరుకు రాజస్థాన్ సంక్షోభానికి చెక్ పెట్టేందుకు రాముల్ రెడీ అయ్యారు. ఈ మేరకు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్-కీలక అసమ్మతి నేత సచిన్ పైలెట్ తో భేటి అవ్వాలని రాహుల్ గాంధీ డిసైడ్ అయ్యారు. వీరిద్దరి మధ్య విభేదాలు పరిష్కరించాలని కాంగ్రెస్ అధిష్టానం రెడీ అయ్యింది.
రాహుల్ గాంధీ కేంద్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురాలేకపోయాననే బాధలో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి పార్టీ వ్యవహారాలను పట్టించుకోవడం లేదు. దీంతో చాలా రాష్ట్రాల్లో సీనియర్ నేతల మధ్య వివాదాలు నడుస్తున్నాయి. వాటిని రాహుల్ పట్టించుకోలేదు. నేతల మధ్య విభేదాలను పట్టించుకోని ఫలితంగా మధ్యప్రదేశ్ లో ప్రభుత్వాన్ని చేతులారా అధికారాన్ని కోల్పోయారు. మాజీ సీఎం కమల్ నాథ్-యువ నేత జ్యోతిరాధిత్య సింధియా మధ్య వివాదాలు పెరిగి చివరకు సింధియా బీజేపీలో చేరి కేంద్రమంత్రి అయ్యారు. మధ్యప్రదేశ్ లోని కాంగ్రెస్ సర్కార్ ను కూల్చారు.
ఇంతకాలం పట్టించుకోని రాహుల్ గాంధీ ఇప్పుడు బీజేపీపై దేశ ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి జ్వాలను క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. ఓట్లను రాబట్టే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీతో సమావేశమైన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇదే విషయాన్ని స్పష్టంగా వారికి చెప్పారు.దీంతో ఇప్పుడు కాంగ్రెస్ బలోపేతంపై అధిష్టానం దృష్టిసారించింది.
దేశంలో బీజేపీకిపై వ్యతిరేకత.. రాష్ట్రాల్లో పరిస్థితిపై ప్రశాంత్ కిషోర్ సుధీర్ఘ వివరణను సోనియా, రాహుల్ కు ఇచ్చారట.. ఈ క్రమంలోనే మేల్కొనకపోతే భవిష్యత్తులో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని పీకే స్పష్టంగా హెచ్చరించాడట.. దీంతో మోడీ వ్యతిరేక పార్టీలన్నింటిని ఏకం చేసి కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషించాలని పీకే సూచన మేరకు రాహుల్ గాంధీ మళ్లీ యాక్టివ్ అయ్యారని తెలుస్తోంది.
ఇందులో భాగంగానే పంజాబ్ కాంగ్రెస్ లొల్లిని ఇటీవలే పరిష్కరించారు. తెలంగాణకు కొత్త పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమించారు. ముఖ్యంగా యువకులకు అవకాశం ఇస్తున్నారు. పంజాబ్, మహారాష్ట్రలోనూ యువ నేతలకే పీసీసీ పగ్గాలు అప్పగించి జోష్ నింపారు. పీకే యువ మంత్రాన్ని రాహుల్ గాంధీ బాగానే వంటబట్టించుకున్నాడు. రాహుల్ గాంధీ ఇప్పుడు దేశ రాజకీయాల్లో యాక్టివ్ అవ్వడం వెనుక పీకే మాస్టర్ ప్లాన్ ఉందని సమాచారం.
వచ్చేసారి అధికారమే లక్ష్యంగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ ను ప్రక్షాళన చేస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ యువకులకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ మార్పు బీజేపీని అధికారానికి దూరం చేస్తుందా? కాంగ్రెస్ ను అధికారంలోకి తెస్తుందా? అన్నది వేచిచూడాలి.