ఎలన్ మస్క్ చేతికి ట్విట్టర్.. డొనాల్డ్ ట్రంప్ తిరిగి ట్విట్టర్ లోకి వస్తాడా?
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను గత అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ విద్వేశాలు రెచ్చగొట్టాడని టాప్ సోషల్ మీడియా దిగ్గజాలు అయిన ఫేస్ బుక్, ట్విట్టర్ , ఇన్ స్టాగ్రామ్ లు నిషేధించాయి. ట్రంప్ కు వాయిస్ లేకుండా చేశాయి. దీంతోపాటు ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోవడంతో చిర్రెత్తుకొచ్చిన ట్రంప్ ఇక శాశ్వతంగా ట్విట్టర్ కు గుడ్ బై చెప్పాడు. తన సొంత సోషల్ మీడియా 'ట్రూత్'ను ప్రారంభించి అందులో కొనసాగుతున్నాడు.
అయితే ట్విట్టర్ తాజాగా చేతులు మారి ఎలన్ మస్క్ చేతికి వచ్చింది. మస్క్ ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ తిరిగి ట్విట్టర్ లోకి రావాలని.. ఆయన వాక్ స్వాతంత్య్రానికి తాను హామీ ఇస్తున్నానని ఆహ్వానించాడు. ఎలన్ మస్క్ చేతికి ట్విట్టర్ వచ్చిన వేళ ఈ వ్యవహారంపై డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికరంగా స్పందించాడు.
డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. 'ఇప్పుడిది తెలివైన వ్యక్తి చేతుల్లోకి వచ్చినందుకు సంతోషంగా ఉంది' అని తెలిపారు. తన సోషల్ మీడియా 'ట్రూత్' వేదికగా ఆయన ఈ మేరకు పోస్ట్ చేశాడు. 'ట్విట్టర్ ఇప్పుడు స్థిరచిత్తం కలిగిన వ్యక్తిచేతుల్లో ఉంది. దీంతోపాటు అమెరికాను ద్వేషించే ర్యాడికల్ లెఫ్ట్ ఉన్మాదుల నిర్వహణ నుంచి బయటకు వచ్చింది. ఈ విషయాలపై చాలా సంతోషంగా ఉంది.. సంస్థను తీవ్రంగా దెబ్బతీసిన నకిలీ ఖాతాలు, ఇతరత్రా కార్యకలాపాలను వదిలించుకోవడానికి ట్విట్టర్ కృషి చేయాలి' అని ట్రప్ సూచించాడు.
అయితే ఎలన్ మస్క్ ఆహ్వానం మేరకు తిరిగి ట్విట్టర్ కు ట్రంప్ తిరిగి వస్తారో లేదో మాత్రం వెల్లడించలేదు. ఎలన్ మస్క్ యజమాని కాగానే ట్విట్టర్ లోని ఆయన అకౌంట్ ను పునరుద్దరిస్తానని ప్రకటించాడు. కానీ తిరిగి ట్విట్టర్ లోకి రానని ట్రంప్ అంటున్నాడు.
కానీ ట్విట్టర్ లో 303.8K ఫాలోవర్లు ట్రంప్ కు ఉన్నారు. అమెరికన్లు అంతా అందులో ఆయన్ను ఫాలో అవుతున్నారు. దీంతో ట్రంప్ తన మనసు ఖచ్చితంగా ఎన్నికల నాటికి మార్చుకుంటాడని తిరిగి వస్తాడని అంటున్నారు.
మస్క్ పునరుద్దరిస్తే ట్రంప్ ఆలోచన మారే అవకాశం ఉంది. వీరి మధ్య బాండింగ్ తో ఇది సాధ్యమయ్యే అవకాశాలు ఉంటాయి. తాజా ట్రంప్ వ్యాఖ్యలు దానికి బలాన్ని కలిగిస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.