బిజెపిని ఓడించడం కేసీఆర్ వల్ల అవుతుందా?

Update: 2023-01-20 02:30 GMT
తెలంగాణ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ తో జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఖమ్మం సభ పెట్టి.. కమ్యూనిస్టులు, ఆమ్ ఆద్మీని గాటిన కట్టి ఒక వేదికపై నుంచి మోడీకి హెచ్చరికలు పంపారు. అయితే దేశమంతా పాకిన బీజేపీని ఎదురించాలంటే కేసీఆర్ ఒక్కడి వల్ల సాధ్యం కాదని తెలుసు. అలాగే ప్రతిపక్ష కాంగ్రెస్ పని  పెద్దగా వర్కవుట్ అయ్యేది లేదని తెలుసు. అయినా కూడా ప్రాంతీయ పార్టీలతో కలిసి మోడీని ఓడించాలని కేసీఆర్ బయలు దేరాడు. మరి బీజేపీని ఓడించడం కేసీఆర్ వల్ల అవుతుందా? లేదా? అన్నది ఇప్పుడు ప్రశ్న.

-ప్రజా వ్యతిరేకతనే మోడీ ఓటమికి నాంది

కార్పొరేట్ మోడీ పాలనకు వ్యతిరేకతను ప్రతిపక్ష కాంగ్రెస్ అందిపుచ్చుకోలేకపోతోంది. రాహుల్ గాంధీ దేశమంతా పాదయాత్ర చేసినా అనుకున్న బజ్ రాలేదు. అలాగని ప్రజలు ఆదరించడం లేదని కాదు. సరైన ప్రత్యామ్మాయంగా కాంగ్రెస్ ను చూడలేకనే జనాలు వేరే ఒక బలమైన పార్టీ కోసం చూస్తున్నారు.

బీఆర్ఎస్ తో కేసీఆర్ ఇప్పుడు ఆ స్థానంలోకి రావాలని ఉబలాటపడుతున్నారు. అయితే మోడీని ఓడించాలంటే కేవలం ప్రాంతీయ పార్టీల బలం మాత్రమే సరిపోదు.. ప్రజల్లోనూ వ్యతిరేకత రావాలి. వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతిపక్షంగా గట్టిగా నిలబడ్డప్పుడే మోడీని ఓడించడం కేసీఆర్ కు సాధ్యమవుతుంది.

-ప్రాంతీయ పార్టీలు, బీఆర్ఎస్ తో సాధ్యమేనా?

కేసీఆర్ రాదు అనుకున్న తెలంగాణను సాధించి చూపెట్టారు. దశాబ్ధాల తెలంగాణ కలను సాకారం చేశారు. ఇప్పుడు దేశమంతా ఏలాలని కలలుగంటున్నారు. మరి ఆయన కల నెరవేరుతుందా? అంటే కొంచెం కష్టమే. బీఆర్ఎస్ ప్రస్తుతం విస్తరించాలి. ప్రాంతీయ పార్టీలన్నీ పట్టుదలతో గెలవాలి. అందరినీ ఒక్క గాటున కట్టి కేసీఆర్ మరో వాజ్ పేయిలా సంకీర్ణం ప్రభుత్వం ఏర్పాటు చేసేంత బలం ఉండాలి

ప్రస్తుతానికి బీజేపీని ఓడించడం కష్టమే. కానీ 2024లో వ్యతిరేకతతో మోడీ ఓడిపోతే.. బీజేపీ మెజార్టీ తగ్గితే మాత్రం ఆ మ్యాజిక్ రిపీట్ చేయడానికి కేసీఆర్ వెనుకాడరు. పొత్తులతో బీజేపీని గద్దెదించడానికి సిద్ధంగా ఉంటాడు. మరి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎవరిది విజయం అన్నది వేచిచూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News