తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడంపై హైకోర్టు మండిపడింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా 48 గంటల్లో లాక్ డౌన్ లేదా కర్ఫ్యూ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని టీఎస్ హైకోర్టు ఆదేశించింది.
తెలంగాణ ప్రభుత్వం కనుక ఈ విషయంలో పట్టించుకోకపోతే తామే ఆదేశాలు జారీ చేయాల్సి వస్తుందని చీఫ్ జస్టిస్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ లో నమోదైన కేసులు, వార్డుల వారీగా కోర్టుకు సమర్పించాలని హైకోర్టు పేర్కొంది.
ఇక ఆర్టీపీసీఆర్ రిపోర్టు 24 గంటల్లో వచ్చేలా చూడాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఆస్పత్రుల్లో సమాచారం ఇవ్వడానికి నోడల్ అధికారిని నియమించాలని హైకోర్టు ఆదేశించింది.
పెళ్లిళ్లు, శుభకార్యాలు, పబ్లిక్ ప్లేసులలో ఎక్కువమంది గుమిగూడకుండా చూడాలని.. వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఇక health.telangana.gov.in వెబ్ సైట్ లో కోవిడ్ వివరాలు నమోదు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది.