గతంలో ఎప్పుడు లేని విధంగా దాదాపు నెలన్నర రోజులుగా తిరుమల శ్రీవారి ఆలయంకు భక్తులను అనుమతించడం లేదు. తిరుమల ఘాట్ రోడ్లు పూర్తిగా మూసేశారు. సామాన్యులు ఎవరు కూడా ఆలయంలోకి ప్రవేశించేందుకు అనుమతి లేదు. కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు అవుతున్న కారణంగా ఆలయంకు భక్తులను అనుమతించడం లేదు. ఈ సమయంలోనే లాక్ డౌన్ ఎత్తివేసినా కూడా జూన్ చివరి వరకు కూడా శ్రీవారి దర్శనంకు అనుమతించరంటూ వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలను టీటీటీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ కొట్టి పారేశారు.
తిరుమల శ్రీవారి ఆలయం గురించి మీడియాలో వస్తున్న వార్తలన్నీ కూడా పుకార్లే అన్నాడు. ఆలయం మూసినట్లు కొందరు ప్రచారం చేస్తున్నారు. ప్రతి రోజు మాదిరిగానే స్వామివారికి నిత్య కైంకర్యాలు జరుగుతున్నాయి. వేద పండితులు స్వామి వారిని సేవిస్తూనే ఉన్నారు. కేవలం భక్తులను మాత్రమే అనుమతించడం లేదు. ఇతర సేవలు అన్ని కూడా జరుగుతున్నాయన్నాడు. ఇక జూన్ చివరి వరకు భక్తులను అనుమతించక పోవచ్చు అంటూ వస్తున్న వార్తలను కూడా ఆయన ఖండ్డించారు.
స్వామివారి దర్శనాన్ని పునరుద్దరించే విషయమై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మే 3వ తారీకు తర్వాత కేంద్రం లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విషయంలో తీసుకునే నిర్ణయాన్ని బట్టి స్వామివారి దర్శనం పునరుద్దరణపై నిర్ణయం తీసుకుంటామని సింఘాల్ అన్నారు. పరిస్థితి అదుపులోకి వస్తే మే 4 నుండి జాగ్రత్తలు పాటిస్తూ స్వామి వారి దర్శన భాగ్యం కల్పించాలంటూ కొందరు భక్తులు కోరుతున్నారు. కాని కొందరు మాత్రం కరోనా పూర్తిగా కనుమరుగయ్యే వరకు స్వామి వారి దర్శనాలను నిలిపేయడమే ఉత్తమం అంటున్నారు. మరి మే 4 నుండి ఏడు కొండలు ఓపెన్ అయ్యేనా చూడాలి.