కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం అధిష్ఠానం అన్వేషణ మొదలుపెట్టింది. రాహుల్ రాజీనామా తరువాత మోతీలాల్ వోరాను తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించినా పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించడానికి సరైన వ్యక్తి కోసం పార్టీ వేట సాగిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా పూర్తిస్తాయి అధ్యక్షుడిని నియమించాలని పార్టీ యోచిస్తోంది.
పార్టీలో నాయకత్వ లేమి ఉందనే విషయం ఇప్పటికే క్షేత్రస్థాయి వరకు క్యాడర్ కు పాకిందని.. ఇది ఇలాగే కొనసాగితే నాయకులు, క్యాడర్లో ఆత్మస్థైర్యం దెబ్బతింటుందన్న ఆందోళనలో హైకమాండ్ ఉంది. అంతేకాదు.. పార్టీకి అధ్యక్షుడు లేకుంటే ఇష్టారాజ్యమైపోతుందని.. యూనిట్లలో బాధ్యతారాహిత్యం పెరిగిపోతుందని భావిస్తున్నారు. కాబట్టి వీలైనంత త్వరగా ఎవరినో ఒకరిని ఈ స్థానంలో నియమించాలనుకుంటున్నరు.
కొత్త అధ్యక్షుడిని గుర్తించే ప్రక్రియ కాంగ్రెస్ కోశాధికారి, సోనియాగాంధీ ఆంతరంగికుడైన అహ్మద్ పటేల్ నేతృత్వంలో సాగుతున్నట్లు సమాచారం. కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం తానూ తగిన సలహాలు, సూచనలు ఇస్తానని, తగిన కృషి చేస్తానని సాక్షాత్తూ సోనియా గాంధీయే ఆంతరంగికులతో అన్నట్లు తెలుస్తోంది. సమర్థులను గుర్తించి చెబితే వారికి తన పూర్తి మద్దతు ఉంటుందని సోనియా స్పస్టం చేసినట్లు సమాచారం.
వచ్చే వారంలోనే పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి అయిన సీడబ్ల్యూసీ భేటీ జరగనుంది.. ఆ భేటీలో కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తారని సమాచారం. సుశీల్ కుమార్ షిండే- మల్లికార్జున ఖర్గే- ముకుల్ వాస్నిక్- అశోక్ గహ్లోత్ వంటి పేర్లు ఈ పదవికి వినిపిస్తున్నా చివరికి మన్మోహన్ సింగ్ ను నియమించే అవకాశాలున్నాయని సమాచారం. ఇప్పటికే మన్మోహన్ పేరును సోనియా ఖరారు చేశారని.. అయితే.. పార్టీలో ప్రజాస్వామ్య విధానం ఉందని చెప్పడానికి ఈ ప్రక్రియ సాగించి చివరకు మన్మోహన్ ను ఖరారు చేస్తారని తెలుస్తోంది. అదే జరిగితే మన్మోహన్ ఈసారి యాక్సిడెంటల్ పార్టీ ప్రెసిడెంట్ కానున్నట్లే.