ఎమ్మెల్సీగా కాంగ్రెస్ సీనియర్?

Update: 2019-02-11 11:18 GMT
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ నిరాకరించడంతో తీవ్ర నిరాశలో కూరుకుపోయిన కాంగ్రెస్ సీనియర్ నేత - మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి కుమారుడు అయిన మర్రి శశిధర్ రెడ్డిని ఈసారి ఎమ్మెల్సీగా పంపాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్టు సమాచారం. మర్రి కూడా ఎమ్మెల్సీగా వెళ్లడానికి తనవంతు ప్రయత్నాలు మొదలు పెట్టారు.

ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కించుకునేందుకు కాంగ్రెస్ రాష్ట్ర శాఖ పావులు కదుపుతోంది. తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్సీగా ఒకరు ఎన్నిక కావడానికి కనీసం 15మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ దఫా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 19 సీట్లను మాత్రమే గెలుచుకుంది. రెబల్స్, స్వతంత్రులతో కలిపి టీఆర్ఎస్ ప్రస్తుతం బలం 90మంది ఎమ్మెల్యేలకు చేరింది.

తాజాగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ ఖాళీ అయిన 9 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి పచ్చజెండా ఊపారు. గ్రాడ్యూయేట్, ఉపాధ్యాయ, ఎమ్మెల్యేల కోటా సహా మరికొన్ని కేటగిరిటీల్లో ఎమ్మెల్సీ పదవులు భర్తీ చేయనున్నారు..

మిగతా 8మంది ఎమ్మెల్సీలను లిస్ట్ ను చూస్తే ఉపాధ్యాయ కోటాలో  గడిచిన దఫా ఎన్నికైన ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్ రెడ్డి, ఇక ఎమ్మెల్యే కోటాలో ఎంఎస్ ప్రభాకర్ రావు, -షబ్బీర్ అలీ -  టీ సంతోష్ కుమార్ - పొంగులేటి సుధాకర్ రెడ్డి - మహ్మద్ సలీం - మహమూద్ అలీలు ఎన్నికయ్యారు. వీరిలో ఎందరు తిరిగి ఎంపికవుతారన్నది వేచిచూడాలి.
Tags:    

Similar News