మోడీ జోరు మ‌రింత పెరుగుతుందా.. జాతీయ రాజ‌కీయం యూట‌ర్న్‌?

Update: 2022-10-10 03:55 GMT
ఔను.. కేంద్రంలో వ‌రుస‌గా రెండుసార్లు గెలుపు గుర్రం ఎక్కిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ జోరు మ‌రింత పెరు గుతుందా?  త్వ‌ర‌లోనే ఆయన త‌న విశ్వ‌రూపం ప్ర‌ద‌ర్శించ‌నున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం లోక్ స‌భ‌లో మాత్ర‌మే మోడీకి, బీజేపీకి భారీ మెజారిటీ ఉంది. ఆయ‌న ఏం చేసినా.. జై కొడుతున్నారు.కానీ, రాజ్య‌స‌భ విష‌యానికి వ‌స్తే.. మాత్రం అంతా యూట‌ర్న్ క‌నిపిస్తోంది. ఇక్క‌డ ఆయ‌న‌కు సానుకూల ప‌రిణామాలు క‌నిపించ‌డం లేదు.

ఈ క్ర‌మంలోనే ప్ర‌తిప‌క్షాల‌ను త‌న‌కు అన‌కూలంగా మార్చుకునే వ్యూహాలు చేస్తున్నారు. బెదిరించో.. మ‌రొక‌టి చేసో.. రాజ్య‌స‌భ‌లో ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌కు జై కొట్టించుకుంటున్నారు. అందుకే.. కొన్ని కొన్ని బిల్లుల విష‌యంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నారు.

అయితే.. ఆర్ ఎస్ ఎస్ వైపు నుంచి రెండు కీల‌క విష‌యాల్లో మోడీపై ఒత్తిడి పెరుగుతోంది. ఒక‌టి జ‌నాభా నియంత్ర‌ణ‌. రెండు హిందే దేశంగా ప్ర‌క‌టించే కీల‌క విష‌యం. ఈ రెండు సాధిస్తే.. ఇక‌, ఆర్ ఎస్ ఎస్ అజెండాలోని దాదాపు అన్ని అంశాల‌కు జై కొట్టిన‌ట్టే.

కానీ, ఈ రెండు విష‌యాలు.. అంత ఈజీగా ఏమీ జ‌రిగిపోయేవి మాత్రం కాదు. జ‌నాభా నియంత్ర‌ణ విష‌యా న్ని ప్ర‌స్తుతానికి.. తెర‌మీదికి తెచ్చినా.. దీని వెనుక‌.. ఓ వ‌ర్గంపై పోరు సాగించే వ్యూహం ఖ‌చ్చితంగా ఉంది. ఇదే ఆర్ ఎస్ ఎస్ అభిష‌లిస్తున్న ప్ర‌ధాన అజెండా. దీనిని సాధించాల‌నేదే.. ఇటీవ‌ల ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ కూడా నొక్కి వ‌క్కాణించారు. ఇది లౌకిక వాద సిద్ధాంతానికి పూర్తి భిన్నంగా ఉంది. అయినా కూడా.. దీనిని సాధించాల‌నేది.. ఇప్పుడు మోడీ టార్గెట్‌.

అదేస‌మ‌యంలో భార‌త్‌ను హిందూ దేశంగా పూర్తి స్థాయిలో ప్ర‌క‌టించాల‌నేది మ‌రో వ్యూహం. ఇప్ప‌టికే ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు చేశారు. అదేవిధంగాత‌లాక్‌పై  కోర్టు ద్వారా విజ‌యం ద‌క్కించుకున్నారు. అయోధ్య‌లో రామ‌మందిర నిర్మాణాన్ని వేగ‌వంతం చేశారు. ఈ ప‌రంప‌రలోనే..

ఇప్పుడు కీల‌క‌మైన ఈ రెండు వ్యూహాల‌ను అమ‌లు చేసేందుకు వ‌డివ‌డిగా అడుగులు వేస్తున్నార‌నేది ప‌రిశీల‌కుల భావ‌న‌. త్వ‌ర‌లోనే రాజ్య‌స‌భ‌లో బీజేపీకి మ‌ద్ద‌తు పెరుగుతుంది. కాంగ్రెస్‌స‌హా.. ఇత‌ర పార్టీల స‌భ్యుల ప‌ద‌వీ కాలం అయిపోవ‌డంతోపాటు.. బీజేపీ మ‌ద్ద‌తు పార్టీల సంఖ్య పెరుగుతుంది. సో.. అప్పుడు ఇక‌, మోడీని ఆపే పరిస్థితి ఉండ‌ద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News