పాక్ బ్యాడ్‌ ల‌క్ సెంటిమెంట్ వ‌ర‌ల్డ్ కప్ తెచ్చిపెడుతుందా?

Update: 2019-06-27 11:47 GMT
దాయాది దేశం పాకిస్థాన్‌ కు బ్యాడ్‌ ల‌క్ సెంటిమెంట్ వ‌ర‌ల్డ్‌ క‌ప్ తెచ్చిపెడుతుంద‌ని క్రీడాభిమానులు చ‌ర్చించుకుంటున్నారు. అనూహ్య విజయాలు.. అంతకుమించి పరాజయాలతో టోర్నీలో పడుతూ లేస్తూ సాగుతున్న పాకిస్థాన్  మ‌ళ్లీ పుంజుకున్న సంగ‌తి తెలిసిందే. కివీస్‌ తో జ‌రిగిన మ్యాచ్‌ లో విజ‌యం సాధించిన పాక్ త‌న సెమిస్ ఆశ‌లు నిలుపుకొంది. ఆరు మ్యాచ్‌ ల్లో రెండింట గెలిచి, మూడింట ఓడి, ఓ మ్యాచ్ రద్దవడంతో ఏడు పాయింట్లతో పట్టికలో ఏడో స్థానంలో ఉన్న సర్ఫరాజ్ సేన.. విలియమ్సన్ సేనతో అమీతుమీ తేల్చుకోవాల్సిన ద‌శ‌లో...గెలిచింది. స‌రిగ్గా ఇదే రీతిలో 1992లో పాక్ గెలుస్తూ ఓడుతూ వ‌చ్చి చివ‌రికి వ‌ర‌ల్డ్ క‌ప్ సాఇంచింది.

వ‌ర‌ల్డ్‌ క‌ప్‌ లో ఫేవ‌రెట్లుగా బ‌రిలో దిగిన జ‌ట్లు సెమీస్ అవ‌కాశాల‌ను సంక్లిష్టం చేసుకోగా..వెస్టిండీస్‌, సౌతాఫ్రికా ఇప్ప‌టికే రేసు నుంచి త‌ప్పుకొన్నాయి. అంతకుమించి పరాజయాలతో టోర్నీలో పడుతూ లేస్తూ సాగుతున్న పాకిస్థాన్.. వరుస విజయాలతో సాఫీగా సాగిపోతున్న న్యూజిలాండ్‌ ను ఢీ కొట్టేందుకు సిద్ధమై విజ‌యం సాధించింది. ఏడు మ్యాచ్‌ లాడిన పాకిస్థాన్ మూడింటిలో గెల‌వగా.. మూడింటిలో ఓడింది. వ‌ర్షం కార‌ణంగా ఒక మ్యాచ్ ర‌ద్దుతో 5 పాయింట్ల‌తో ఏడో స్థానంలో ఉంది. మ‌రోవైపు పాయింట్ల ప‌ట్టిక‌లో రెండో స్థానంలో ఉన్న కివీస్ ఇంకో మ్యాచ్ గెలిస్తే సెమీస్ బెర్తు ఖాయం చేసుకుంటుంద‌నే ద‌శ‌లో ఆ దేశాన్ని ఓడించింది. ఈ మ్యాచ్‌ లో గెలిచి నాకౌట్ బెర్త్‌ ను పటిష్ఠం చేసుకోవాలని కివీస్ కోరుకోగా ఆ ఆశ‌లు క‌ల్ల‌లు చేసుకుంది.

1992 వ‌ర‌ల్డ్‌ క‌ప్‌ కు, నేటి వ‌రల్డ్‌ క‌ప్‌ కు అనేక పోలిక‌లు ఉన్నాయ‌ని పేర్కొంటున్నారు. ఇమ్రాన్‌ ఖాన్ కెప్టెన్‌ గా ఉన్న ఆ స‌మ‌యంలో తొలి మ్యాచ్‌లో పాక్ ఓడిపోయింది. త‌ర్వాతి మ్యాచ్‌ లో గెలిసింది. మూడో మ్యాచ్‌లో ఫ‌లితం రాక‌పోగా నాలుగో మ్యాచ్‌లో ఓట‌మి పాల‌యింది. అయిదో మ్యాచ్‌లో ఓడిన‌ప్ప‌టికీ...ఆరు, ఏడు మ్యాచ్‌ ల‌లో గెలుపొందింది. స‌రిగ్గా తాజా వ‌ర‌ల్డ్‌ క‌ప్‌ లో సైతం అదే త‌ర‌హా ఫ‌లితాల‌ను పాక్ టీం ఎదుర్కుంటోంది. ఈ నేప‌థ్యంలో...1992 వలే మ‌ళ్లీ పాక్ మ్యాచ్ గెలుస్తుంద‌ని అంటున్నారు.


Tags:    

Similar News