ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి పని చేస్తే ఏమవుతుందన్న దానిపై అందరికి ఫుల్ క్లారిటీ ఉంది. కొంతకాలం క్రితం టాలీవుడ్ అగ్రనటి సమంత.. తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లోని పేరును తొలగించటం హాట్ టాపిక్ గా మారటమే కాదు.. సామ్.. చైతూలు విడిపోతున్నారా? అన్న ప్రచారం మొదలైంది. అందుకు తగ్గట్లే కొంతకాలానికి వారిద్దరూ తాము విడిపోతున్నట్లుగా ప్రకటించి షాకిచ్చారు. తాజాగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా.. ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్న పాప్ సింగర్ నిక్ జొనాస్ లు విడిపోతున్నారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
దీనికి కారణం తాజాగా ప్రియాంక సోషల్ మీడియా పేజీలో.. తన భర్త ఇంటిపేరును ఆమె తొలగించటమే కారణంగా చెప్పాలి. ప్రియాంక చోప్రా తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలైన ట్విటర్.. ఇన్ స్టాగ్రామ్ లలో చోప్రా జొనాస్ పేరును తొలగించింది. కేవలం ‘‘ప్రియాంక’’ పేరుతో మాత్రమే ఆమె ఖాతా ఉంది. దీంతో.. వీరిద్దరి మధ్య వైవాహిక బంధానికి బ్రేకులు పడ్డాయా? అన్నది ప్రశ్నగా మారింది.
ఈ వార్తలపై ప్రియాంక తల్లి మధు చోప్రా స్పందించారు. వారు విడిపోతున్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని.. అవన్నీ చెత్త పుకార్లుగా అభివర్ణించారు. ఇదే అంశం మీద ప్రియాంక స్నేహితురాలు స్పందిస్తూ.. ప్రియాంక తన ఫ్యూచర్ ప్రాజెక్టుల కోసమే తన పేరును మార్చుకున్నారని చెప్పారు.ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో జొనాస్ పేరును మాత్రమే కాదు చోప్రా పేరును కూడా తొలగించిన విషయాన్ని గుర్తు పెట్టుకోవాలంటున్నారు.
దాదాపు మూడేళ్ల క్రితం (2018)లో ఇరు కుటుంబాల సమక్షంలో ప్రియాంక.. జొనాస్ లు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. రాజస్థాన్ లో వీరి పెళ్లి వేడుక ఘనంగా సాగింది. మొన్నటికి మొన్న దీపావళి సందర్భంగా భర్తతో కలిసి ఉన్న ఆమె ఫోటోల్ని షేర్ చేశారు. అందులోనూ ఎంతో అన్యోన్యంగా ఉన్నట్లుగా ఫోటోలు ఉన్న వేళలో.. అంతలోనే పేరు ఎందుకు మార్చాల్సి వచ్చిందన్నది చర్చగా మారింది. ఈ రచ్చకు పుల్ స్టాప్ పెట్టేలా ప్రియాంక స్పందిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.