వ్యక్తి మరణిస్తే వేలిముద్రలు ఎందుకు మారుతాయి..? ఫోన్ ద్వారా గుర్తించవచ్చా!
మనం ఎంత చదువుకున్నా... ఎంత స్టయిల్ గా సంతకం పెట్టగలిగినా కూడా వేలిముద్రల ముందు అంతా ఒట్టిముచ్చటే. ఒకప్పుడు వేలిముద్ర వేసేవాళ్లు అంటూ చదువుకోని వారిని... కొందరు ఎగతాళిగా మాట్లాడేవారు. కానీ ఆ వేలిముద్రల స్థానం మాత్రం ఇప్పటికీ పదిలంగానే ఉంది. ఇంత సాంకేతికత అందుబాటులోకి వచ్చినా కూడా ముఖ్యమైన అంశాల్లో వేలిముద్రలనే ప్రామాణికంగా తీసుకుంటారు. ఇకపోతే వ్యక్తి గుర్తింపు నుంచి మొదలుకుంటే అతడు చేసిన నేరాల చిట్టా వరకు వేలిముద్రలు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఈ వేలి ముద్రల్లో తేడా ఉంటుందా? వ్యక్తి బతికిఉన్నప్పుడు ఒకలాగా... చనిపోయాక మరోలాగా కనిపిస్తాయా? అనేది చాలా మందికి ఉన్న సందేహం. పైగా మరణించిన వ్యక్తి ఫింగర్ ప్రింట్స్ తో అతడి ఫోన్ అన్ లాక్ అవుతుందా? దీనిపై వాస్తవాలేంటో చూసేద్దామా..!
వేలిముద్రలు అనేవి ఎవరికి వారికే సొంతం. ఒక్కో వ్యక్తి ఒక్కో ప్రత్యేకమైన వేలిముద్రలను కలిగిఉంటాడు. అందుకే వీటిని చాలా ప్రామాణికంగా తీసుకుంటారు. ఇకపోతే ఫింగర్ ప్రింట్ మనిషి చనిపోయాక మారుతాయి. జీవించి ఉన్నప్పుడు ఉన్న వేలిముద్రలు చనిపోయాక అలాగే ఉండవు. ప్రాణం పోయిన తర్వాత శరీరంలోని అన్ని క్రియలు ఆగిపోతాయి. క్రమంగా శరీరం రంగు మారుతుంది. ఇక వేలిముద్రలు కూడా మారుతాయి. అందుకే చనిపోయిన వ్యక్తి ఫోన్ ను కూడా ఫింగర్ ప్రింట్ సాయంతో తీయలేము. మరి ఆ వ్యక్తి ఏమైనా నేరాలు లేదా వేరే అవసరం ఉంటే వేలిముద్రలను ఎలా గుర్తించగలుగుతారు అనేది పెద్ద సందేహం. అయితే చనిపోయిన తర్వాత వేలిముద్రలు మారినా కూడా గుర్తించే సౌలభ్యం ఉంది.
వ్యక్తి మరణించిన తర్వాత వేలి ముద్రలు మారడం నిజమే. అయితే అవసరాల మేర నిపుణులు వాటిని గుర్తించగలుగుతారు. అవే ఫోరెన్సిక్ ల్యాబ్ లు. మరణించిన వ్యక్తి వేలిముద్రలు... అతడు బతికిఉన్నప్పుడు ఎలా ఉండేవో ఈ ప్రయోగశాలల్లో గుర్తించగలుగుతారు. ఇకపోతే చనిపోయిన వ్యక్తి వేలిముద్రలతో అతడి ఫోన్ కూడా అన్ లాక్ చేయలేరు. పైగా ఆ వ్యక్తి జీవించి ఉన్నాడా? లేడా అనే విషయాన్ని ఫోన్ అన్ లాక్ ప్రక్రియతో తెలుసుకోవచ్చు. ఎందుకంటే బతికిఉన్నప్పటి వేలిముద్రలు, వ్యక్తి చనిపోయిన తర్వాతి ఫింగర్ ప్రింట్స్ మారుతాయి. ఇవి మ్యాచ్ కానందున మొబైల్ అన్ లాక్ ప్రక్రియ జరగదు. ఫోన్ అన్ లాక్ కాలేదు అంటే... అతడి వేలిముద్రలు మారిపోయాయి. అంటే అతడు జీవించి ఉండకపోతేనే మారుతాయి.
వాస్తవానికి మనిషి శరీరంలో ఒకరకమైన విద్యుత్ ప్రవాహం జరుగుతుంది. దాని ద్వారానే సెల్ ఫోన్ సెన్సార్ ప్రక్రియ జరుగుతుంది. ప్రాణం పోయిన తర్వాత మానవశరీరంలో జరిగే అన్ని చర్యలు ఆగిపోతాయి. మనంలో ప్రవహించే విద్యుత్ సైతం ఆగిపోతుంది. ఈ క్రమంలో సెల్ ఫోన్ సెన్సార్ పనిచేయదు. ఈ తేడాలు సాధారణ వ్యక్తులు గుర్తించలేరు. వ్యక్తి వేలిముద్రలను ఫోరెన్సిక్ ల్యాబ్ లో నిపుణులు అవలీలగా గుర్తించగలుగుతారు. ఎంత సాంకేతికత అందుబాటులోకి వచ్చినా కూడా వేలిముద్రల స్థానం చాలా ప్రామాణికం. అందుకే ఆధార్ వంటి విశిష్టమైన గుర్తింపు కార్డు కోసం వేలిముద్రలను ప్రధానంగా సేకరిస్తారు.