ఆనం వారి క‌ల ఫ‌లించేనా... !

Update: 2023-01-19 00:30 GMT
ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి. నెల్లూరు జిల్లా రాజ‌కీయాల్లో ఇప్పుడు ఈ పేరు చాలా హాట్ టాపిక్‌. వైసీపీ పార్టీ త‌ర‌ఫున గ‌త ఎన్నిక ల్లో విజ‌యం ద‌క్కించుకున్న ఈయ‌న మంత్రి ప‌ద‌విని ఆశించారు. ఒక‌ద‌ఫా కాక‌పోయినా..రెండో ద‌ఫాలో అయినా.. త‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని అనుకున్నారు. కానీ, ఆయ‌న‌కు ఆశాభంగం అయింది. నిజానికి ఆయ‌న గ‌తంలో టీడీపీలో ఉన్న ప్పుడు కూడా ఎమ్మెల్సీ ఆశించారు. త‌ద్వారా అయినా.. మంత్రి వ‌ర్గంలోకి వెళ్లాల‌ని అనుకున్న‌ట్టు నెల్లూరు వ‌ర్గాల్లో ఒక చ‌ర్చ సాగింది.

అయితే.. ఆ క‌ల నెర‌వేరక పోవ‌డంతో ఆనం.. వైసీపీ బాట‌ప‌ట్టారు. ఇక్క‌డ కూడా ఆయ‌న ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయాల‌ని అనుకున్నారు. అయితే, అది సాధ్యం కాక‌పోవ‌డంతో వెంక‌ట‌గిరి నుంచి పోటీ చేశారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ బ‌లంగా ఉంది. పైగా అప్ప‌టి సిట్టింగ్ ఎమ్మెల్యే రామ‌కృష్ణ‌కు మంచి పేరు కూడా ఉంది. ఈ నేప‌థ్యంలో వైసీపీ త‌న‌ను కావాల‌నే.. ఇలా ఓడిపోయే సీటును కేటాయించింద‌ని.. ఆనం వ‌ర్గం ఆందోళ‌న ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

అయిన‌ప్ప‌టికీ.. వైసీపీ గాలి.. జ‌గ‌న్ పాద‌యాత్ర వంటివి ఇక్క‌డ కూడా ప‌నిచేసి ఆనం గెలుపు గుర్రం ఎక్కారు. ఇక‌, ఇప్పుడు.. వైసీపీ నుంచి ఆయ‌నను త‌ప్పించ‌డం ఖాయ‌మైపోయింది. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న ఏ పార్టీలోకి వెళ్తార‌నేది ఇప్ప‌టికిప్పుడు ఇత‌మిత్థంగా తెలియ‌క‌పోయినా.. ఆయ‌న కోరుకునే స్థానం మాత్రం 'ఆత్మ‌కూరు' అని తెలుస్తోంది. అయితే.. ఆత్మ‌కూరు టికెట్ టీడీపీ ఇస్తుందా? అనేది ప్ర‌శ్న‌. నిజానికి ఆయ‌న‌ను పార్టీలో చేర్చుకునేందుకు కొంద‌రు నాయ‌కులు ఇష్ట ప‌డ‌డం లేదు.

అయిన‌ప్ప‌టికీ..చంద్ర‌బాబు సూచ‌న‌లు, స‌ల‌హాల మేర‌కు ఆనం రాక‌కు అడ్డు లేక‌పోయినా.. ఆత్మ‌కూరులో ఆనంకు స‌హ‌క‌రించే వారు ఉన్నారా? అనేది ప్ర‌శ్న‌. ఒక‌ప్పుడు ఇక్క‌డ నుంచి వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకున్నా.. ఇప్పుడు గాలంతా..

వైసీపీ వైపు మ‌ళ్లింది. దీంతో ఇప్పుడు ఆనం గెలుపు గుర్రం ఎక్క‌డం సాధ్య‌మేనాఅన్న‌ది ప్ర‌శ్న‌. మ‌రోవైపు ఇక్క‌డ నుంచి బైపోల్స్‌లో గెలిచిన ఆనం విక్ర‌మ్ రెడ్డి సొంత నిధులు రూ.కోటి వెచ్చించి.. అభివృద్ధి ప‌నుల‌కు శ్రీకారం చుడుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఆనం పార్టీ మారినా.. ఆయ‌న క‌ల ఫలించేనా అనేది నెల్లూరు టాక్‌!!మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News