టీ కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేల మధ్య అనైక్యత నిన్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మరోసారి బట్టబయలైంది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మొత్తం 19 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. వీరిలో నుంచి 12 మంది శాసనసభ్యులు ఇటీవల అధికార పార్టీలో చేరిపోయారు. రాజ్యాంగ బద్దంగానే వీరు టీఆర్ ఎస్ లో విలీనం అయ్యారని స్పీకర్ ప్రకటించారు. ఇక ఏడుగురిలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలుపొందడంతో ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య ఆరుకు చేరుకుంది. దీంతో ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది.
అయితే మిగిలిన ఈ ఆరుగురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి- జగ్గారెడ్డిలు ఎవరికివారుగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయం తాజాగా అసెంబ్లీలో స్పష్టమైంది. మున్సిపల్ చట్టాన్ని ఆమోదించేందుకు ప్రత్యేకంగా సమావేశపరిచిన అసెంబ్లీలో సీఎల్పీ నేత బట్టి విక్రమార్క హడావుడి చేశారు. అసెంబ్లీ లో ప్రవేశ పెట్టిన బిల్లులపై మాట్లాడే సందర్భంలో… పార్టీ ఫిరాయింపుల అంశాన్ని లేవనెత్తారు.
అయితే సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో సేవ్ డెమోక్రసీ ఫ్లకార్డులు పట్టుకుని సభలో కాంగ్రెస్ సభ్యులు నిరసన తెలిపారు. సభలోకి కూడా నల్ల కండువాలతో వచ్చారు. ఆరుగురు ఎమ్మెల్యేలతో భట్టి అసెంబ్లీ సమావేశానికి ముందే భేటీ ఏర్పాటు చేశారు. దీనికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరు కాలేదు. కానీ సభకు హాజరయ్యారు. అయినా సభలో కాంగ్రెస్ సభ్యుల నిరసనకు తన మద్దతు తెలియచేయలేదు.
ఉదయం సీఎల్పీ భేటీకి హాజరు కాకుండా, ఆ తర్వాత సభలో కాంగ్రెస్ నిరసన కూడా తనకు పట్టనట్లుగా వ్యవహరించిన రాజగోపాల్ రెడ్డి.. స్పీకర్ ను కలిసినప్పుడు మాత్రం.. కాంగ్రెస్ సభ్యులతో కలిసి వెళ్లారు. అయితే భేటీ ముగిసిన వెంటనే.. మళ్లీ మీడియా ముందుకు వచ్చి సొంత నాయకత్వంపై విమర్శలు గుప్పించారు. ఇక మరో ఎమ్మెల్యే జగ్గారెడ్డి సభకు హాజరైనా నల్ల కండువా మాత్రం వేసుకోలేదు. సభలో కూడా నిరసన సందర్బంగా ఫ్లకార్డు పెట్టుకోకుండా ఆయన సభ నుండి బయటకు వచ్చేశారు. దీంతో ఉన్న ఆరుగురిలో కూడా ఐక్యత లేదని తేలి పోయింది.