ఉత్తరాంధ్రా ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటుందా..?

Update: 2022-04-05 13:30 GMT
ఉత్తరాంధ్రా జిల్లాలు బాగా వెనకబడినవి అని అందరికీ తెలిసిందే. ఈ వెనకబాటుతనం మూడు కాస్తా ఆరు జిల్లాలుగా పెరిగింది. జిల్లాలు పెరిగాయి కానీ సమస్యలు అలాగే ఉన్నాయి. అవి దశాబ్దాలుగా వారసత్వగా వస్తున్నాయి. అత్యంత వెనకబడిన జిల్లాలుగా శ్రీకాకుళం, విజయనగరం లను చూడాలి. గతంలో శ్రీక్రిష్ణా కమిషం తో పాటు శివరామక్రిష్ణన్ కమిటీ కూడా ఉత్తరాంధ్రా బాగా దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటోందని అధ్యయం చేసి వెల్లడించింది.

ఇక ఉమ్మడి ఏపీలో అలో లక్ష్మణా అంటూ ఈ ప్రాంతాలు అలమటించాయి. నాడు హైదరాబాద్ రాజధానిగా ఉండేది. ఎనిమిదివందల కిలోమీటర్ల దూరం శ్రీకాకుళం జిల్లాకు క్యాపిటల్. దాంతో ఆరు పదుల ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ ముఖం చూసిన సిక్కోలు వాసులు పది శాతం కంటే తక్కువ ఉంటారు అంటే అది షాకింగ్ న్యూసే.

ఇక ఈ జిల్లాల వారికి ఒడిషా దగ్గర. అలాగే విజయవాడ దాకా వలసలు వెళ్ళి బతుకు తెరువు వెతుక్కున్నారు. శ్రీకాకుళం, విజయనగరం  రెండు జిల్లాలలో వ్యవసాయానికి సాయమే లేదు, సాగు చేసుకునే దారి లేదు. సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం వల్లనే భూములు ఉండి కూడా రైతులు వాటిని వదిలేసి కూలి పనులకు వెళ్ళిపోవడం జరిగింది.

ఇక నూటికి ఎనభై శాతం బీసీలు. దాంతో వారంతా ఇతర ఉపాధి పనులను వెతుక్కుని తమ జీవితాలను సాగిస్తూ వచ్చారు. భవన నిర్మాణ కార్మికులుగా ఎక్కువ మంది ఇక్కడ వారే కనిపిస్తారు. ఇక చదువులు చదివిన యువత ఉపాధి లేక వేరే చోటకు పొట్ట చేతపట్టుకుని వెళ్ళిపోయింది.

ఉత్తరాంధ్రా మొదటి నుంచి అధికార పార్టీకివ్యతిరేకంగానే ఉంటూ వచ్చింది. పోరాటాల గడ్డగా అలా పేరుంది. ఒక గౌతు లచ్చన్న, తెన్నేటి విశ్వనాధం లాంటి మహనీయులు ఈ ప్రాంతంలో రాజకీయం చేశారు. ఉద్యమాల బాట నడిపించారు. ఇక అరవై దశకం లో నక్సలైట్ ఉద్యమం కూడా ఈ వైపుగానే పుట్టింది.

దాంతో కూడా ఈ ప్రాంతం మీద అధికార వెలుగులు ఎపుడూ పెద్దగా పడలేదు అనుకోవాలి. ఇక టీడీపీ స్థాపించాక మాత్రం ఆ పార్టీకి ఉత్తరాంధ్రా భుజం కాసింది. యాంటీ కాంగ్రెస్ ఇజాన్ని తన నరాల్లో జీర్ణించుకున్న ఈ ప్రజలు సైకిలెక్కేశారు. అలా కొన్ని దశాబ్దాల పాటు ఆ పార్టీ వెంట నడచినా బతుకులు మాత్రం బాగుపడలేదు

దాంతో విసిగి వేసారిన జనాలు మధ్యలో ఒకటి రెండు సార్లు కాంగ్రెస్ కి కూడా పట్టం కట్టారు. ఇక 2019 ఎన్నికల వేళ టోటల్ గా ఉత్తరాంధ్రా జిల్లాలు వైసీపీ వైపు టర్న్ అయ్యాయి.  గడచిన  మూడేళ్లలో చూస్తే అభివృద్ధి ఏదీ లేకపోవడంతో ఇపుడు ఆ పార్టీ మీద కూడా ఆశలు మెల్లగా  వదిలేసుకుంటున్న పరిస్థితి.

అలాగని టీడీపీ గ్రాఫ్ కూడా పెద్దగా పెరిగింది లేదు, కొత్త పార్టీలను అంతగా నమ్మడంలేదు. విభజన తరువాత తమ ప్రాంతాలకు  ప్రత్యేక ఆర్ధిక  ప్యాకేజ్ వస్తుందని, అభివృద్ధి సాగుతుందని భావించినా బీజేపీ కేంద్రం నుంచి పెద్దగా సాయం చేయలేదు అన్న అసంతృప్తి ఉంది. మొత్తానికి ఉత్తరాంధ్రా జిల్లాల రాజకీయం మాత్రం గరం గరం గా ఉంది. వచ్చే ఎన్నికల వేళ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోవడానికి రెడీగా ఉంది. మరి ఈసారి ఏ పార్టీకి జై కొడుతుందో చూడాలి.
Tags:    

Similar News