300 మంది కోసం 30 ల‌క్ష‌ల కేడ‌ర్‌ను వైసీపీ పోగొట్టుకుంటుందా?

Update: 2022-06-13 07:30 GMT
2014 ఎన్నిక‌ల్లో కేవ‌లం 1 శాతం ఓట్ల తేడాతో వైసీపీ అధికారం పోయింది. అప్పుడు కేడ‌ర్ స‌రిగా ప‌నిచేయ లేదనే టాక్ వినిపించింది.  అంతేకాదు.. క్షేత్ర‌స్థాయిలో కూడా అంత‌గా కేడ‌ర్ బ‌లంగా లేద‌ని టాక్ వినిపిం చింది. ఇక‌, 2019 విష‌యానికి వ‌స్తే.. అప్ప‌టికి మూడేళ్ల ముందు నుంచే జాతీయ రాజ‌కీయ వ్యూహక‌ర్త ప్ర శాంత్ కిశోర్‌.. ఉర‌ఫ్ పీకేను ఆశ్ర‌యించ‌డంతో.. ఆయ‌న వ్యూహాలు, సూచ‌న‌లు.. స‌ల‌హాల మేర‌కు పార్టీని బ‌లోపేతం చేసే దిశ‌గా అడుగులు వేశారు. దీనిలో ప్ర‌ధానంగా కేడ‌ర్‌ను బ‌లోపేతం చేశారు.

ఫ‌లితంగా వైసీపీ అంటే.. కేడ‌ర్ బేస్డ్ పార్టీ అనే పేరు వ‌చ్చింది. కొత్తి ఇంచార్జ్‌ల‌ను నియ‌మించుకుని.. గ‌డ ప గ‌డ‌ప‌కు తిరిగి.. వైసీపీని గెలిపించాల‌ని.. వైసీపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాల‌ని.. టీడీపీ అన్యాయం చేసింద‌ని.. త‌మ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను లాగేసుకుంద‌ని.. వీరిలో న‌లుగురికి మంత్రి ప‌ద‌వులు కూడా ఇచ్చింద‌ని ఇలా.. గ‌డ‌ప గ‌డ‌పకు ప్ర‌చారం చేశారు. ఈ క్ర‌మంలో వైసీపీ కేడ‌ర్ దాదాపు 30 ల‌క్ష‌ల మంది త‌యార‌య్యారు.

30 ల‌క్ష‌ల మంది ప్ర‌తి ఒక్క‌రూ ఏవ‌రేజ్‌గా ఐదుగురు ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేస్తే.. కోటి ల‌క్ష‌ మంది ఓట్లు వేస్తే.. 49.95 శాతం ఓట్లు జ‌గ‌న్ ప‌డ్డాయి. ఫ‌లితంగా.. దేశంలోనే అత్య‌ధిక మెజారిటీ సాధించిన పార్టీగా.. ప్ర‌భుత్వం ఏర్పాటు చేసుకున్నారు. అయితే.. ప్ర‌బుత్వం వ‌చ్చిన తర్వాత‌.. స‌చివాల‌యంలో ఎమ్మెల్యే లు, కార్పొరేష‌న్ల‌లో చైర్మ‌న్లు అంతా క‌లిపి 300 మంది ఉంటే.. వాళ్ల కోసం.. జ‌గ‌న్ 30 ల‌క్ష‌ల మంది కేడ‌ర్ పోగొట్టుకున్నార‌ని.. పెద్ద ఎత్తున వైసీపీ కేడ‌ర్‌లో చ‌ర్చ జ‌రుగుతోంది.

మేమంతా.. ప్ర‌తి ఇంటికీ, ప్ర‌తి గ‌డ‌ప‌కు తిరిగి ఓట్లు వేయిస్తే.. ఇప్పుడు వ‌చ్చిన వారు.. కొత్త ఎమ్మెల్యేలు, లాట‌రీలో టికెట్ వ‌చ్చిన ఎమ్మెల్యేలు. అంతా క‌లిపి.. కేడ‌ర్‌ను ప‌ట్టించుకోకుండా.. వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది. జ‌గ‌న్ ఏమో.. బ‌య‌ట‌కు రాడు, ఎమ్మెల్యేలు ప‌ల‌క‌రు. వ‌లంటీర్లు.. మాకు ప‌ల‌క‌రు. అని కేడ‌ర్ వాపోతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. మ‌రోవైపు.. స‌ర్పంచుల‌కు చెక్ లేదంట‌. ఎంపీపీ, జెడ్పీటీసీల‌కు కేవ‌లం బిస్క‌ట్లు, టీ కోసం.. స‌మావేశాలు.. అని పెద్ద ఎత్తున ఎక్క‌డ ర‌చ్చ‌బండ ఉన్నా.. ఇదే చ‌ర్చ జ‌రుగుతోంద‌ట‌!.  

టీడీపీ కేడ‌ర్ మాత్రం వైసీపీ కేడ‌ర్‌ను ఆడుకుంటోందంట‌. ఎందంటే.. మేం చూడు బాగా సంపాదించాము, ఖాళీగా కూర్చున్నాం. రేపు మ‌ళ్లీ మా ప్ర‌భుత్వం వ‌స్తుంది. మేము మ‌ళ్లీ సంపాదిస్తాము. అనిపెద్ద ఎత్తున గ్రామాల్లో వాళ్ల తాకిడి త‌ట్టుకోలేక‌.. వైసీపీ కేడ‌ర్ ఇబ్బంది ప‌డుతున్నార‌ట‌. ఎమ్మెల్యేలు అంతా దాదాపు 70 శాతం కొత్త వాళ్లు రాజ‌కీయం తెల‌య‌ని వాళ్లు.. జ‌గ‌న్ బొమ్మ మీద గెలిచిన వాళ్లు.

వాళ్ల‌ను ప‌ని అడిగితే.. ప‌ల‌క‌డం లేదు. ప్ర‌తి జిల్లాల‌లో ఈ మ‌ధ్య పెద్ద ఎత్తున కేడ‌ర్‌కి ఎమ్మెల్యేకి గ్యాప్ వ‌చ్చింది. అలానే.. ఎంపీ వ‌ర్సెస్ ఎమ్మెల్యేల మ‌ధ్య కొట్లాట‌లు జ‌రుగుతున్నాయి. ఇలాంటి ప‌రిస్థితిలో 300 మంది కోసం.. 30 ల‌క్ష‌ల మంది కేడ‌ర్‌ను వైసీపీ అధిష్టానం వ‌దిలేస్తోంద‌నే వాద‌న వినిపిస్తుండడం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News