నోట్లో సుక్క పడితే ఆ సుఖమే వేరేనే మందుబాబు మాటలు మామూలోళ్లకు ఓపట్టాన అర్థం కాదు. నిత్యం అంతో ఇంతో చుక్క గొంతులోకి దిగితే తప్పించి పొద్దు గడవని లక్షలాది మందికి కరోనా నరకమే చూపించింది. కంటికి కనిపించని వైరస్ పుణ్యమా అని విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో మద్యం దుకాణాల్ని బంద్ పెట్టటం తెలిసిందే. రానున్న ఉపద్రవాన్ని గుర్తించిన కొందరు ముందుస్తుగా ఇళ్లల్లో స్టాక్ పెట్టుకోవటం తెలిసిందే.
ఎంత సరుకు కొనేసి ఇంట్లో దాచేసినా.. దగ్గర దగ్గర ఆరేడు వారాలు లాక్ డౌన్ పుణ్యమా అని మందుబాటిళ్లు ఖాళీ అయిపోయిన దుస్థితి. దీంతో.. మందు దొరక్క పడుతున్న బాధలు అన్ని ఇన్ని కావు. ఎంత రేటైనా ఫర్లేదన్న వారికి మద్యం దొరుకుతుంటే.. మిగిలిన వారు మందు దొరక్క పిచ్చెక్కిపోతున్న పరిస్థితి. ఇలాంటి వేళ ఏపీ సర్కారు మందుబాబులకు అదిరిపోయే శుభవార్తను వెల్లడించింది.
సోమవారం ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి ఏడు గంల వరకూ ఏపీలో మద్యం అమ్మకాలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ ప్రకటనతో తెలంగాణలోని పలువురు తీవ్రమైన ఆసూయకు గురవుతున్నారు. మందుబాబుల బాధల్ని ఏపీ సర్కారు పట్టించుకున్నట్లుగా తెలంగాణలో పట్టటం లేదన్న వేదనను వ్యక్తం చేస్తున్నారు. మద్యం అమ్మకాలకు ఓకే చెప్పేసి.. మందు కొనే వారు ఎలాంటి విధివిధానాల్ని పాటించాలన్న దానిపై మార్గదర్శకాల్ని జారీ చేశారు.
మందు అమ్ముతామన్న మాటను చెప్పాలంటే.. ఎంతటి కఠిన పరీక్షలకైనా రెఢీ అంటున్నారు మందుబాబులు. ఏపీలో మద్యం అమ్మకాలకు ఓకే చెప్పిన వేళ.. తెలంగాణ రాష్ట్రం మాత్రం అందుకు భిన్నంగా ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోకపోవటాన్ని తప్పు పడుతున్నారు. ఏదిఏమైనా ఏపీ ప్రజలకొచ్చిన అదృష్టాన్ని చూసుకొని తీవ్రమైన ఆసూయకు గురవుతున్నారు.
ఆంధ్రాలోని మందుబాబుల అవసరాల్ని అక్కడి ప్రభుత్వం గుర్తించినప్పుడు తెలంగాణ సర్కారు మాత్రం అదేమీ పట్టనట్లుగా వ్యవహరించటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఏపీ ప్రజలకు పట్టిన మందు అదృష్టం కేసీఆర్ సారుకు సురుకు పుట్టకపోవటం ఏమిటంటూ మందుబాబుల మాటల్లోని ఆవేదన ఉట్టిపడుతోందని చెప్పక తప్పదు.