ఏపీలో విభజన తరువాత తొలి హోం మంత్రిగా ఒక మహిళను వైసీపీ ఎంపిక చేసి రాజకీయ సంచలనం సృష్టించింది. జగన్ సీఎం అయ్యాక తొలి విడతలో మేకతోటి సుచరిత హోం మంత్రి అయ్యారు. ఆమె మూడేళ్ల మంత్రిత్వం పూర్తి అవుతూనే ఆ శాఖను తానేటి వనితకు అప్పగించారు. దాంతో జగన్ ఏలుబడిలో హోం మంత్రిగా మహిళలకే ప్రాధాన్యత ఇచ్చినట్లు అయింది. పైగా ఇద్దరూ ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వారు కవడం ఇక్కడ విశేషం.
ఇక వచ్చేది మా సర్కారే అని ఉవ్విళ్ళూరుతున్న తెలుగుదేశం పార్టీలో కాబోయే హోం మంత్రుల జాబితా చాలా పెద్దదిగానే ఉంది. ఆ మధ్య ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు మాట్లాడుతూ తమ ప్రభుత్వం వస్తే తానే పట్టు బట్టి మరీ హోం శాఖను తీసుకుంటానని, వైసీపీ వారి అరాచకాలకు తగిన జవాబు చెబుతానని శపధమే చేశారు.
ఇదే కోవలో చాలా మంది తమ్ముళ్లు హోం శాఖ మీద కన్నేశారు. లోకేష్ కూడా తాము వైసీపీ వాళ్ల తప్పులు అన్నీ లెక్క వేస్తున్నామని, రేపటి తమ ప్రభుత్వంలో తానే బాధ్యత తీసుకుని అందరి చిట్టాలు బయటపెడతాను అని చెప్పుకొచ్చారు. హోం మంత్రి పదవి మీద చాలా మంది ఇలా కన్ను వేశారని తేలిపోతున్న వేళ అందులోకి తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత కూడా వచ్చి చేరారు.
ఆమె ఒక చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దీని మీద తన ఆసక్తిని అయితే వ్యక్తం చేశారు. ప్రస్తుత హోం మంత్రి తానేటి వనిత ఉన్నారని, ఆమె తరువాత అనిత కొత్త హోం మంత్రి అవుతారా అని ఆర్కే అడిగిన ప్రశ్నకు సూటినా బదులివ్వకపోయినా ఎస్ అన్నట్లుగానే ఆమె చెప్పడం విశేషం. అయితే తనకు పదవుల మీద ఆశలు లేవంటూనే అధినేత ఏమి ఇస్తే అదే చాలు అని లౌక్యంగా అనిత సమాధానం చెప్పారు.
ఇక సామాజికవర్గం కోణం, మహిళా కోటా ఇవన్నీ చూసుకుంటే టీడీపీ అధికారంలోకి వస్తే తాము కూడా మహిళలకు ఎస్సీలకు ఉన్నత పదవిని ఇచ్చామని చెప్పుకోవడానికి చంద్రబాబు కూడా అనితకు హోం పదవి ఇవ్వవచ్చు అన్నది ప్రచారంలో ఉంది. ఇక అనిత కూడా బహుశా దీన్ని దృష్టిలో ఉంచుకునే తాము అధికారంలోకి వస్తే వైసీపీ నేతల లెక్కలు అన్నీ సరిచేస్తామని ముందే పోలీస్ మంత్రిగా బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు.
మరి ఈ రోజు వనిత రేపటి రోజున అనిత హోం మంత్రిగా వస్తారా ఏపీ అలా చూడబోతోందా అంటే జవాబు అవును అనడానికి చాన్సెస్ చాలానే ఉన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే కనుక అనిత మంత్రి అని ఫిక్స్ అయిపోతున్నారు ఆమె అనుచరులు. ఇపుడు ఈ ఇంటర్వ్యూ తరువాత కాబోయే హోం మంత్రి మా అనితమ్మ అని కూడా చెప్పేసుకుంటున్నారు. చూడాలి మరి వనితకు దక్కిన లక్ అనితకు కూడా దక్కుతుందో లేదో.