త‌న వాట్సప్ చూశాడ‌ని భ‌ర్త‌ను న‌రికేసింది

Update: 2017-06-12 15:34 GMT
ఈ వార్త చ‌దివితే భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య బంధాలు మ‌రీ ఇంత దిగ‌జారాయా అనిపిస్తుంది. అస‌లు.. బంధాలు.. అనుబంధాలు మ‌నుషుల్లో ఉన్నాయా అనిపిస్తుంది. త‌న‌తో ఏడ‌డుగులు న‌డిచి.. మూడు ముళ్లేసుకొని.. జీవితాంతం భ‌ర్త‌కు తోడుండాల్సిన భార్య బ‌రితెగింపు చ‌ర్య‌కు పాల్ప‌డితే ఓ భ‌ర్త ఏం చేయాలి? ఇటువంటి ఘ‌ట‌నే ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో జ‌రిగింది. ఖేరాఘ‌ర్ లోని భిలావ‌లి గ్రామానికి చెందిన నేత్రాపాల్ కు 2014 లో నీతూ సింగ్ తో వివాహం అయింది. వివాహం అయిన కొన్ని రోజుల‌కే.. నీతూ కు వేరే అబ్బాయి తో సంబంధ‌ముంద‌ని, అత‌డినే ప్రేమిస్తున్న‌ద‌ని నేత్రాపాల్ కు తెలిసింది. దీంతో ఇద్ద‌రి మ‌ధ్యా మ‌న‌స్ప‌ర్థ‌లు వ‌చ్చి విడిపోయారు.

అయితే.. రీసెంట్ గా ఓ ఫ్యామిలీ ఫంక్ష‌న్ ఉంటే త‌న భ‌ర్త ఇంటికి నీతూ వ‌చ్చింది. ఇంట్లో ఉండ‌గానే వాట్స‌ప్ లో త‌న ప్రియుడి తో చాట్ చేస్తుండ‌గా గ‌మ‌నించిన నేత్రాపాల్.. నీతూ ను ఫోన్ ఇవ్వాల‌న్నాడు. నీతూ ఇవ్వ‌లేదు. వెంటనే త‌న‌ను నెట్టేసి ఫోన్ తీసుకొని త‌న వాట్స‌ప్ చాట్ మొత్తం చూశాడు. దీంతో కోపోద్రికురాలైన నీతూ కొడ‌వ‌లితో నేత్రాపాల్ త‌ల మీద బ‌లంగా న‌రికింది. వెంట‌నే కుప్ప‌కూలిపోయాడు నేత్రాపాల్. గ‌మ‌నించిన బంధువులు వెంట‌నే అత‌డిని హాస్పిట‌ల్ కు త‌ర‌లించ‌గా.. ఇదే అదునుగా భావించిన నీతూ త‌న ప్రియుడితో క‌లిసి పారిపోయింది.

త‌ల‌కు బ‌ల‌మైన గాయ‌ల‌వ్వడంతో నేత్రాపాల్ త‌లకు కుట్లు వేశారు డాక్ట‌ర్లు. అదృష్ట‌వ‌శాత్తూ ప్రాణాపాయం నుంచి త‌ప్పించుకున్నాడు నేత్రాపాల్. ప్రియుడితో క‌లిసి పారిపోయిన నీతూ, త‌న ప్రియుడిని దొరికించుకున్న నేత్రాపాల్ బంధువులు ఇద్ద‌రినీ చిత‌క‌బాది పోలీసుల‌కు అప్ప‌గించారు. అయితే... నేత్రాపాలే కొడ‌వ‌లితో త‌ల మీద‌ న‌రుక్కొని... త‌న మీద నేరం మోపుతున్నాడ‌ని నీతూ పోలీసుల‌కు చెప్ప‌డం కొస‌మెరుపు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News