ఆమె చేసిన తప్పు ఏమైనా ఉందంటే.. ప్రేమించిన వ్యక్తిని నమ్మి పెళ్లి చేసుకోవటమే. అలా పెళ్లి చేసుకున్న ఒక హిందూ మహిళకు భూమి మీదనే నరకం అంటే ఏమిటో చూపించాడో మత ఛాందసవాద భర్త. కోల్ కతాకు చెందిన ఒక హిందూ మహిళ బీహార్ కు చెందిన ఆసిఫ్ ను ప్రేమించి పెళ్లాడింది. ఆ తర్వాత నుంచి కష్టాలు మొదలయ్యయి. ప్రేమ కాస్తా పెళ్లిగా మారిన తర్వాత ఆమెకు అసలుసిసలు కష్టాలు మొదలయ్యాయి.
బీహార్ రాజధాని పాట్నాలో అత్తారింట్లోకి అడుగు పెట్టిన నాటి నుంచి ఆమెను మతంలోకి మారాలంటూ చిత్రహింసలు మొదలయ్యాయి. అవి కాస్తా రోజురోజుకి పెరిగాయి. ఆమె మతం మారేందుకు నో చెప్పటంతో చిత్రహింసల తీవ్రత మరింత పెరిగింది. కుటుంబ సభ్యులతో కలిసి ఆమె చేత బలవంతంగా బీఫ్ తినిపించారు. అనంతరం నగ్నంగా ఉంచి ఆమెను వీడియో తీశారు.
ముస్లిం మతాచారాలను తూచా తప్పకుండా పాటించాలంటూ వేధించటంతో పాటు.. ఆమె ఒకవేళ నో చెబితే.. ఆమె నగ్న చిత్రాలు బయటపెడతామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆమెను మదర్సాలో ఉంచి మరిన్ని హింసలకు గురి చేశారు. ఇవన్ని తట్టుకోలేని ఆమె ఎట్టకేలకు పోలీసుల్ని ఆశ్రయించింది. తీవ్ర సంచలనం రేపిన ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇందుకు కారణమైన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. జరిగిన ఘటనపై విచారణ జరుపుతున్నారు. ఎంత ప్రేమించి పెళ్లి చేసుకుంటే మాత్రం ఇన్ని కష్టాలా..?