జ‌ర్న‌లిస్టునూ వ‌ద‌ల్లేదుగా.. వేధించేశారు

Update: 2017-11-17 12:16 GMT
దేశంలో వేధింపుల ప‌ర్వం ప‌రాకాష్ట‌కు చేరుతోంది. ప్ర‌భుత్వాలు ఎన్ని చ‌ట్లాలు తెస్తున్నా.. ప్ర‌యోజ‌నం క‌నిపించ‌డం లేదు. ఒక‌ప్పుడు  ఏదో ఒక మూల మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు జ‌రిగితే.. పెద్ద పెద్ద శీర్షిక‌ల‌తో వార్త‌లు వ‌చ్చేవి. కానీ, ఇటీవ‌ల కాలంలో అభివృద్ధి చెందిన మెట్రో న‌గ‌రాల్లోనే మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోతోంది. దీనికి దేశ రాజ‌ధాని ఢిల్లీ పెద్ద ఉదాహ‌ర‌ణ‌. నిర్భ‌య ఘ‌ట‌న దేశాన్ని - ప్రపంచాన్ని సైతం వ‌ణికించింది. ఈ ఘట‌న త‌ర్వాత దేశంలో నిర్భ‌య చ‌ట్టం తెచ్చి.. మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పిస్తామ‌ని ప్ర‌భుత్వాలు కంక‌ణం క‌ట్టుకున్నాయి. ఏడాదికి వెయ్యి కోట్ల‌ను కూడా మ‌హిళ‌ల ర‌క్ష‌ణ కోసం కేంద్రం బ‌డ్జెట్‌ లో కేటాయిస్తోంది. అయినా.. కూడా వారి ర‌క్ష‌ణ నేతి బీర‌కాయ‌లో నెయ్యిలాగా మారింది.

తాజాగా ఓ మ‌హిళా జ‌ర్న‌లిస్టుపైనే వేధింపులు జ‌రిగాయి. విష‌యంలోకి వెళ్తే.. ఢిల్లీ ఐటీవో మెట్రో స్టేషన్లో  ఓ మ‌హిళా జర్నలిస్టు(25) ను ఓ దుండుగుడు  వేధించాడు. కావాలని ఆమెను ప‌దే ప‌దే తాకుతూ వేధింపుల‌కు ఒడిగ‌ట్టాడు.  అయితే క్షణాల్లో అతని నుంచి తప్పించుకున్న జ‌ర్న‌లిస్టు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఇది నాలుగు రోజుల కింద చోటు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. ఈ నెల 13న మెట్రో స్టేష‌న్‌ లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ముందు పొరపాటున తాకినట్టుగా తాను భావించాననీ, కానీ మళ్లీ అదే పని చేయడంతో  షాకయ్యానని జర్నలిస్టు  చెప్పారు.  కొన్నిసెకన్లలలో వెంటనే తేరుకున్నట్టు చెప్పారు.

అయితే, ఈ ఉదంతం అంతా స్టేష‌న్‌ లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. నిందితుడు వ్య‌వ‌హ‌రించిన విధానంతో పాటు.. బాధితురాలు  ప్రతిఘటించిన దృశ్యాలు సీసీ కెమెరాలో స్ప‌ష్టంగా క‌నిపించాయి.  దీని ఆధారంగా  నిందితుడిని గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇక‌, ఇక్క‌డ ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం ఏంటంటే.. అంత పెద్ద మెట్రో స్టేష‌న్‌ లో భ‌ద్ర‌తా సిబ్బంది లేక‌పోవ‌డం మ‌రింత వివాదానికి దారితీసింది. లేదంటే స్పాట్‌ లోనే ఆ నిందితుడిని పోలీసులు అడ్డ‌గించే అవ‌కాశం ఉండేద‌ని జ‌ర్న‌లిస్టు వాపోయారు. అంతేకాదు ఫిర్యాదు  చేయడానికి వెళితే గంటన్నరపాటు వెయిట్‌ చేయాల్సి వచ్చిందని ఆమె చెప్ప‌డం పోలీసుల నిర్ల‌క్ష్యాన్ని మ‌రోసారి తెర‌మీద‌కి తెచ్చింది. మ‌రి దీనిపై సీఎం కేజ్రీవాల్ కానీ - లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ కానీ ఎలా స్పందిస్తారో చూడాలి.

Full View
Tags:    

Similar News