ఏపీలో సంచలనం సృష్టించిన కాల్ మనీ ఉదంతం గుర్తుంది కదా. హైదరాబాద్‌లో అంతకంటే ఘోరం జరిగింది. నగరంలో డీడీ కాలనీలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. అప్పు చెల్లించలేదని వడ్డీ వ్యాపారి తన అనుచరులతో ఓ మహిళను కిడ్నాప్ చేపించాడు. పోలీసులు రంగంలోకి దిగడంతో కథ సుఖాంతం అయింది.
డీడీ కాలనీలో ఆర్కిడ్ అపార్ట్‌మెంట్ వాచ్‌మన్ శ్రీనివాస్‌కు వడ్డీ వ్యాపారి రూ. 3 లక్షలు అప్పుగా ఇచ్చాడు. 100కు రూ. 10 వడ్డీ. వాచ్‌మన్ కొంతవరకు అప్పు తిరిగి చెల్లించినా మొత్తం అప్పు చెల్లించాలంటూ ఒత్తిడి చేశాడు. ఆనక సకాలంలో అప్పు చెల్లించలేదని పేర్కొంటూ వాచ్‌మన్ ఇంటిపై గుండాలతో దాడి చేసి అతని భార్య నాగమణిని బలవంతంగా ఎత్తుకెళ్లారు. అప్పు చెల్లిస్తేనే నీ భార్యను వదిలిపెడతామని పేర్కొన్నారు. దీంతో జరిగిన విషయంపై వాచ్‌మన్ శ్రీనివాస్ అంబర్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. రంగలోకి చర్యలు చేపట్టిన పోలీసులు వడ్డీ వ్యాపారి స్థావరంపై దాడి చేసి నాగమణికి విముక్తి కల్పించారు. వడ్డీ వ్యాపారిని, అతని అనుచరులను అదుపులోకి తీసుకున్నారు.