హైదరాబాద్ నగర పరిధిలోని మూసాపేట్ లో ఓ మహిళ కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఓ యువతిని చేతులు కట్టివేసి ఇన్నోవా కారులో తీసుకుపోతున్నట్లు పోలీసు కంట్రోల్ రూమ్ కి స్థానికులు సమాచారం అందించారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే .. నారాయణఖేడ్‌కు చెందిన మహిళ ఆన్ లైన్ లో చీరల వ్యాపారం చేస్తూ మూసాపేట లో ఉన్న శ్రీ రాములు థియేటర్ సమీపంలో నివాసం ఉంటుంది. ఆమెకు వివాహం చేయడం కోసం తల్లిదండ్రులు ఎన్నోసార్లు ప్రయత్నించి విసుగుచెందారు. దీనికి తోడు ఆమె కొన్నాళ్లుగా మానసిక సమస్యలతో బాధపడుతోంది. ఈ క్రమంలోనే బుధవారం ఆమెను హాస్పిటల్ కు తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు హైదరాబాద్ కు చేరుకున్నారు.
అయితే తాను ఆస్పత్రికి రానని మహిళ పట్టుబడటంతో వారు బలవంతంగా కారులో తీసుకెళ్లేందుకు యత్నించారు. ఈ విషయం తెలియని స్థానికులు ఆమెను కిడ్నాప్ చేస్తున్నారనుకుని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీనితో సనత్‌నగర్ పోలీసులు వెంటనే గాలింపు చేపట్టి యువతిని ఎర్రగడ్డలో గుర్తించారు. తల్లిదండ్రులు తనను బలవంతంగా తీసుకుపోతున్నారంటూ మహిళ ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన పై విచారణ మొదలు పెట్టారు.