క్షణాల్లో ప్రాణాలు తీసే పిడుగు ను లోదుస్తులుగా ఉండే బ్రా ఎదుర్కోవటం ఏమిటన్న ఆశ్చర్యం కలగొచ్చు కానీ.. ఇది నిజం. పలువురికి విస్మయాన్ని రేకెత్తిస్తోంది. పిడుగుపాటు నుంచి ప్రాణాలు రక్షించిన బ్రా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ ఆసక్తికర విషయానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
చైనాలోని బీజింగ్ నగరంలోని ఒక ప్రాంతం తుఫానులతో అట్టుడుకుపోతుంది. భారీగా వర్షాలు పడుతున్నాయి. ఆ ప్రాంతానికి చెందిన లాయ్ అనే మహిళ.. తన కొడుకును స్కూల్ నుంచి తీసుకురావటానికి గొడుగు తీసుకొని బయలుదేరింది. ఆమె నడుస్తున్న దారి మధ్యలో పెద్ద పిడుగుపాటు సంభవించింది. ఆమె గొడుగు వేసుకొని వెళ్లటంతో పిడుగును.. గొడుగు మీదున్న ఇనుప ముక్క ఆకర్షించింది. దీంతో దిశ మార్చుకొని నేరుగా పిడుగు ఆమె మీద పడే పరిస్థితి.
సరిగ్గా ఇక్కడే ఒక వింత చోటు చేసుకుంది. వాయువేగంతో.. లక్షల ఓల్టుల శక్తితో దూసుకొచ్చిన పిడుగు ఆమె చాతీ మీద పడే సమయంలో ఆమె ధరించిన బ్రా పిడుగును అడ్డుకొంది.
ఆమె ధరించిన బ్రాలోని మెటల్ వైర్లు రక్షణగా నిలిచాయి. దీంతో.. పిడుగు తీవ్రతను భారీగా తగ్గించేశాయి. ఎంతంటే.. ఆమె అవయువాలకు ఎలాంటి హాని కలగకుండా చేశాయి. కాకుండే ఆమె దుస్తులు కాలిపోయి.. చర్మం కాలినా ప్రాణాపాయ స్థితి నుంచి మాత్రం తప్పించుకుంది. ఆమెను ఆసుపత్రికి తరలించి వైద్యం చేస్తున్నారు.ప్రస్తుతం ఆమె ప్రాణానికి ఎలాంటి హాని లేదని చెబుతున్నారు. ఒక బ్రా.. పిడుగును ఎదుర్కోవటం ఇప్పుడు పలువురిని ఆశ్చర్యచకితుల్ని చేస్తోంది.