ఇటీవలే పబ్ జీ ఎక్కువగా ఆడి తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఓ యువకుడి మెడనరాలు దెబ్బతిని మృతిచెందాడు. వ్యసనంగా మారుతోన్న పబ్ జీ ఆట చాలా మంది కాపురాలు కూడా కూలుస్తోంది. తాజాగా ఈ ఆటకు బానిస అయిన ఓ వివాహిత.. ఏకంగా తన కన్న కూతురును సైతం వదిలి భర్తతో విడాకులు కోరడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
గుజరాత్ రాష్ట్రానికి చెందిన చెందిన 20 ఏళ్ల యువతికి బిల్డింగ్ కాంట్రాక్టర్ గా పనిచేస్తున్న యువకుడితో పెళ్లి అయ్యింది. వారికి సంవత్సరం వయసులోపు పాప ఉంది. అయితే పబ్ జీ ఆటకు బానిసైన యువతి.. తనకు విడాకులు కావాలంటూ అభయం ప్రభుత్వ హెల్ప్ లైన్ సెంటర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేసింది. విడాకులకు కారణాలేంటని అడగ్గా.. పబ్ జీ ఆటలో పరిచయమైన యువకుడితో జీవితం పంచుకుంటానని చెప్పిందట.. ఆ యువకుడిని పెళ్లి చేసుకుంటే ఇద్దరం కలిసి పబ్ జీ ఆడుకోవచ్చని సెంటర్ నిర్వాహకులకు చెప్పిందట..
మహిళ సమాధానానికి విస్తుపోయిన అభయం హెల్ప్ లైన్ నిర్వాహకులు ఆమెను కొంతకాలం పబ్ జీ వ్యసనం రూపుమాపేందుకు అహ్మదాబాద్ లోని సహాయక శిబిరంలో ఉండాలని సూచించారు. ఫోన్లు లేకుండా అక్కడ ట్రీట్ మెంట్ చేస్తారు. కానీ సదురు మహిళ రానంటూ మొడికేసింది.
పబ్ జీ మాయలో పడి ఓ మహిళ ఇలా భర్తను - కూతురును వదిలేసి విడాకులు కోరడం. ఆ వార్త బయటకు రావడంతో మీడియాలో హైలెట్ అయ్యింది. అందరూ షాక్ కు గురయ్యారు. పబ్ జీ మాయలో జీవితాలను ఇలా నాశనం చేసుకుంటున్నారని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనుషులను బానిసలుగా మార్చి.. పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్న పబ్ జీ ఆటను నిషేధించాలని ఇప్పటికే చాలా మంది కోరుతున్నారు.