ఈ మధ్యన చోటు చేసుకుంటున్న కొన్ని ఉదంతాలు భయానకంగా ఉండటంతో పాటు.. ఎప్పుడేం జరుగుతుందోనన్న సందేహాలు వ్యక్తమయ్యే పరిస్థితి. అంతేకాదు.. ఎవరిని నమ్మాలో అర్థం కాని దుస్థితి నెలకొంది. పరాయివాళ్లను నమ్మే రోజులు పోయి చాలాకాలమే అయినా.. సొంతోళ్లు.. అందునా కట్టుకున్న భార్యను భర్త.. భర్తను భార్య కూడా నమ్మలేని దారుణ పరిస్థితుల్లోకి వెళ్లిపోతున్నామా? అన్న భావన కలుగుతోంది.
వివాహేతర సంబంధాల మోజులో పడి భార్యను భర్త.. భర్తల్ని భార్యలు చంపటం అంతకంతకూ పెరిగిపోతోంది. ఇటీవల కాలంలో ఈ తరహా ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. తాజాగా అలాంటిదే మరొకటి చోటు చేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లా మఖ్తల్ మండలంలో చోటు చేసుకుంది.
తాగుడుకి బానిసైన భర్త.. భార్యను అదే పనిగా వేధించటమే కాదు.. ఈ రోజు ఉదయం ఆమె పని చేస్తున్న స్కూల్లోకి వెళ్లి కత్తితో ఆరుసార్లు పొడిచేసిన వైనం సంచలనంగా మారింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. అనంతరం తనను తాను పొడుచుకున్న భర్తను సైతం ఆసుపత్రికి తరలించారు.
స్థానికంగా తీవ్ర సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే.. దాదాన్ పల్లికి చెందిన కన్యాకుమారికి కర్నూలు జిల్లాకు చెందిన రమణారెడ్డితో ఏడేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. కన్యాకుమారి ముస్లాయిపల్లి గ్రామ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. రమణారెడ్డి ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తున్నారు.
చక్కగా సాగిపోతున్న వారి జీవితాల్లో మద్యం మహమ్మారిగా మారింది. తాగుడుకు బానిసైన రమణారెడ్డి భార్యను తరచూ వేధిస్తూ ఉండేవాడు. దీంతో వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.
ఈ రోజు ఉదయం పూటుగా తాగేసిన రమణారెడ్డి కన్యాకుమారి జాబ్ చేస్తున్న స్కూల్లోకి వెళ్లి.. కత్తితో దాడి చేసి.. ఆరుసార్లు పొడిచేశాడు. ఊహించని పరిణామంతో పిల్లలు భయభ్రాంతులకు గురికాగా.. గాయాలతో కన్యాకుమారి కుప్పకూలిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని కేసునమోదు చేసి విచారిస్తున్నారు.