డ్రైవ‌ర్‌తో సెక్స్‌.. భ‌ర్త‌ను చంపేసింది.. తెలంగాణ‌లో దారుణం

Update: 2022-12-25 16:30 GMT
``పెళ్ల‌యిన త‌ర్వాత‌.. ప్రేమించుకోండ‌మ్మా!!` అని పూర్వ‌కాలంలో త‌ల్లిదండ్రులు పిల్ల‌ల‌కు చెప్పేవారు. అంటే.. దీని అర్ధం.. పెళ్ల‌యిన త‌ర్వాత‌.. భ‌ర్త భార్య‌ను, భార్య భ‌ర్త‌ను ప్రేమించుకోవాల‌ని. కానీ, ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతోంది. అయితే.. భ‌ర్త ను కాద‌ని వేరేవారిని ప్రేమిస్తున్న భార్య‌లు, భార్య‌ను కాద‌ని.. వేరేవారిని ప్రేమిస్తున్న భ‌ర్త‌లు పెరిగిపోతున్నారు. ఈ క్ర‌మంలో క‌ట్టుకున్న‌వారిని క‌డ‌తేర్చేందుకు ఎలాంటి వెనుక‌డుగు వేయ‌డం లేదు.

తాజాగా ఇలాంటి ఘ‌ట‌నే.. తెలంగాణ‌లోని గ‌ద్వాల్ జిల్లాలో జ‌రిగింది. ప్రియుడిపై మోజులో భ‌ర్త‌ను మ‌ర్మా య‌వాల‌పై కొట్టి చంపేసింది భార్య‌. తీవ్ర సంచ‌ల‌నం సృష్టించిన ఘ‌ట‌న‌.. అంతే విషాదాన్ని కూడా నింపిం ది. గ‌ద్వాల్ జిల్లా పెబ్బేర్‌ మండలం బూడిదపాడుకు చెందిన ఎండీ అబ్దుల్లా(35) గద్వాల పట్టణానికి చెందిన మ‌హిళ‌ను 12 ఏళ్ల కిందట సంప్ర‌దాయంగా వివాహం చేసుకున్నాడు.

గద్వాలలోనే కూలీ పనులు చేస్తు జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో అబ్దుల్లా మద్యానికి బానిసై కుటుంబ పోషణ పట్టించుకోవడం మానేశాడు. ఈ క్ర‌మంలో భార్య సూచ‌న‌ల మేర‌కు కూలీ పనులు మాని ఇంటి వద్దే సొంతంగా కూరగాయల వ్యాపారం ప్రారంభించాడు. వ్యాపార సమయంలో భార్య కూడా స‌హ‌క‌రించేది. అయితే, మార్కెట్‌ నుంచి ఆటోలో రోజూ కూరగాయాలు తీసుకువచ్చే డ్రైవర్‌ రఫీతో ఆరు నెలలుగా ఆమెకు వివేహాత‌ర సంబంధం ఏర్ప‌డింది.

విషయం గుర్తించిన అబ్దుల్లా ఆమెను మందలించాడు. అనున‌యించాడు. తానుమారాన‌ని, మ‌ద్యం కూడా తాగ‌డం లేద‌ని న‌చ్చ‌జెప్పాడు. అయితే, ప్రియుడి మోజులో ప‌డ్డ ఆమె.. ఏకంగా భ‌ర్త‌ను చంపేసేందుకు ప్లాన్ చేసింది. రెండు రోజుల కింద‌ట ఇంట్లో అబ్దుల్లా ఒంటరిగా నిద్రిస్తుండగా, భార్య గమనించి ప్రియుడు రఫికి ఫోన్‌ చేసి ఇంటికి రావాలని తెలిపింది.

ఇంతలోనే భార్య ఇంటి తలుపులను మూస్తుండగా, తలుపులు ఎందుకు వేస్తున్నావంటూ భర్త ప్రశ్నించేలోపే భార్య రెండు కాళ్లు లాగి కిందకు పడేసింది. అక్కడే ఉన్న ప్రియుడు చున్నీతో గొంతుకు బలంగా బిగించి, మర్మాంగాలపై ఇద్ద‌రూ క‌లిసి ప‌చ్చ‌డి బండ‌తో బ‌లంగా కొట్టారు. దీంతో అబ్దుల్లా అక్కడికక్కడే మృతి చెందాడు.  

మ‌రో ప్లాన్‌..
అయితే.. భ‌ర్త‌ను చంపేసిన భార్య‌.. ఎవరికీ అనుమానం రాకుండా రఫీని ఇంటి నుంచి బయటకు పంపింది.  భర్తకు సోదరుడు అయ్యే హాజీకి ఫోన్‌ చేసి అబ్దుల్లాకు ఫిట్స్‌ వచ్చి చనిపోయినట్లు ఫోన్‌ చేసి భార్య చెప్పింది. బంధువులు వచ్చి చూడగా గొంతుపై కమిలి ఉండడం, ఛాతీ, ముఖంపై గాయాలు ఉండడంతో అనుమానం వచ్చింది. దీంతో పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌గా.. విష‌యం బ‌య‌ట ప‌డింది. ఇదీ.. సంగ‌తి!!
Tags:    

Similar News