హెలికాఫ్ట‌ర్‌ లో వ‌చ్చి ఆల‌యంలో దిగేస్తారంట‌

Update: 2016-01-26 10:18 GMT
కొన్ని ఆల‌యాల‌కు మ‌హిళ‌ల‌కు ప్ర‌వేశం క‌ల్పించ‌రు. ఇది మంచా? చెడా? అన్న విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. అదో సంప్ర‌దాయంగా సాగుతుంటుంది. అలాంటి దేవాల‌యాలు దేశంలో కొన్ని ఉంటాయి. అయితే.. ఈ మ‌ధ్య కాలంలో వ‌చ్చిన మార్పుల‌తో అలాంటి ఆల‌యాల్లోకి త‌మ‌ను ఎందుకు అనుమ‌తించ‌ర‌న్న వాద‌న ఒక‌టి ఈ మ‌ధ్య‌న మొద‌లైంది. ఆ మ‌ధ్య‌న కేర‌ళ‌లోని శ‌బ‌రిమ‌లై ఆల‌యంలోకి ఎంట్రీ విష‌యంలో ఇలాంటి వివాద‌మే చోటు చేసుకుంది.

తాజాగా మ‌హారాష్ట్రలోని షిగ్నాపూర్‌ లోని శ‌ని ఆల‌యంలోకి గ‌డిచిన 60 సంవ‌త్స‌రాలుగా మ‌హిళ‌ల‌కు ప్ర‌వేశం లేదు. దీనిపై భూమాత ర‌ణ‌రాగిణి బ్రిగేడ్ సంస్థ‌కు చెందిన కార్య‌క‌ర్త‌లు 400 మంది ఆల‌యంలోకి ప్ర‌వేశించాల‌ని నిర్ణ‌యించ‌టం ఇప్పుడు వివాదంగా మారింది. త‌మ‌ను ఆల‌యంలోకి అనుమ‌తించే విష‌యంలో ఎవ‌రైనా అడ్డుకుంటే.. ఒప్పుకోమంటున్న వారు.. అవ‌స‌ర‌మైతే హెలికాఫ్ట‌ర్ లో అయినా ప్ర‌యాణించి ఆల‌యానికి చేరుకుంటామ‌ని తేల్చి చెబుతున్నారు.

హెలికాఫ్ట‌ర్ లోని నుంచి నిచ్చెల‌తో ఆల‌యంలోకి ప్ర‌వేసిస్తామ‌ని తేల్చిచెబుతున్నారు. ఇదిలా ఉంటే దేవాల‌యం ఉన్న షిగ్నాపూర్ గ్రామ‌స్తులు ఆల‌యంలోకి మ‌హిళ‌లు ప్రవేశించ‌కుండా అడ్డుకుంటామ‌ని తేల్చి చెప్ప‌టంతో ఇప్పుడ‌క్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. మ‌రి.. ఈ స‌వాళ్లు.. ప్ర‌తిస‌వాళ్లు ఎక్క‌డి వ‌ర‌కూ వెళ‌తాయ‌న్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది.
Tags:    

Similar News