ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో నివసిస్తోన్న భాటియా కుటుంబం సామూహిక ఆత్మహత్యల ఉదంతం దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ 11 మంది ఆత్మహత్యకు పాల్పడే ముందు ఇంట్లో ‘వటవృక్ష’ పూజ నిర్వహించారని - ఎవరైనా తంత్ర విద్య తెలిసిన వారు లేదా పూజారుల సమక్షంలోనే దానిని నిర్వహిస్తారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కాబట్టి, బయటి నుంచి వచ్చిన వ్యక్తి ఆ పూజను నిర్వహించి ఉంటారని, ఆ తర్వాత ఆ ఇంటి ప్రధాన ద్వారం ద్వారా బయటకు వెళ్లి ఉంటారని పోలీసులు అనుమానించారు. ఆత్మహత్యల అనంతరం ఆ ఇంటి ప్రధాన ద్వారం తెరిచి ఉండటంతో పోలీసుల అనుమానాలు బలపడ్డాయి. దీంతో, ఈ ఆత్మహత్యల వెనుక 12వ వ్యక్తి ప్రమేయం ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆ 12వ వ్యక్తిగా అనుమానిస్తోన్న గీతా మా అనే మహిళను ఢిల్లీ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు.
ఆ తాంత్రిక పూజల వెనుక ఆ మహిళ హస్తం ఉందని, ఆ 11 మందిని గీతా మానే ఆత్మహత్యలకు ప్రేరేపించిందనన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ‘గీతా మా’నే భాటియా కుటుంబాన్ని తాంత్రిక పూజలకు ప్రేరేపించిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం భాటియా కుటుంబం ఉంటున్న ఇంటిని నిర్మించిన కాంట్రాక్టర్ కూతురే ఈ గీతా మా అని పోలీసులు తెలిపారు. అయితే, ఆమెతో ఈ ఆత్మహత్యల సూత్రధారిగా భావిస్తోన్న లలిత్ భాటియాకు సన్నిహిత సంబంధాలున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, భాటియా కుటుంబం తమకు తామే ఆత్మహత్యలకు పాల్పడేలా గీతా మా వ్యూహ రచన చేసిందా అన్న కోణంలో ఆమెను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అంతకుముందు, ఆ ఘటనకు సంబంధించిన ఓ సీసీటీవీ ఫుటేజ్ బయటకొచ్చిన విషయం తెలిసిందే. చనిపోడానికి కొద్ది గంటల ముందు ఆ కుటుంబంలోని కొందరు వ్యక్తులు ఆత్మహత్యల కోసం స్టూలు - వైర్లు తీసుకుని వెళ్తున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. మరోవైపు, ఆ ఇంటిని ఆలయంగా మార్చాలని కొందరు స్థానికులు పోలీసులకు సూచిస్తున్నారట. ఈ ఉదంతం తర్వాత చుట్టుపక్కల ఇళ్లలోని చాలామంది భయంతో తమ ఇళ్లను ఖాళీ చేసి వెళ్తున్నారని, ఆ ఇంటిని కొనేందుకు కూడా ఎవరూ ముందుకు రారని చెబుతున్నారట. కాబట్టి, ఆ ఇంటిని ఆలయంగా మార్చితేనే మంచిదని కొందరు స్థానికులు అభిప్రాయపడుతున్నారట.