అమెరికా ఎన్నికల్లో ట్రంప్ కి తగ్గిన మహిళల మద్దతు !

Update: 2020-11-04 15:30 GMT
అమెరికా ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠ భరితంగా జరుగుతుంది. ఫలితాలు ముగింపునకు వస్తున్న తరుణంలో ఇద్దరు అభ్యర్థుల్లో ఎవరు గెలుస్తారనే అంచనా దొరకడం లేదు. విజయం ట్రంప్, బిడెన్ మధ్య దోచులాడుతుంది. కొంత సమయం ట్రంప్ ఆధిక్యంలో కొనసాగితే , మరికొంత సమయం బిడెన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దీనితో పూర్తి ఫలితాలు వెల్లడైయ్యే వరకు ఉత్కంఠత కొనసాగేలా ఉంది. ఈ ఎన్నికల్లో అమెరికా ఓటర్ల స్పందన ఆసక్తికరంగా ఉంది. పురుషులు రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వైపు మొగ్గు చూపగా మహిళలు డెమొక్రాట్ అభ్యర్థి జోయి బైడెన్ వైపు మొగ్గు చూపారు.

ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటి వరకు లెక్కించిన ఓట్ల ప్రకారం, మహిళల్లో 56 శాతం మంది బైడెన్‌కు ఓటేశారట. ఇక ట్రంప్‌కు మహిళల నుంచి 43 శాతం మాత్రమే ఓట్లు వచ్చాయి. ఇక పురుషుల విషయానికి వస్తే, ట్రంప్‌కు 49 శాతం మంది మద్దతు ఇచ్చారు. కాగా, ట్రంప్‌ తో పోల్చుకుంటే బైడెన్‌ కు పురుషుల మద్దతు కొంచెం తక్కువగా ఉంది. 48 శాతం మంది పురుషులు బైడెన్‌ కు మద్దతు తెలిపారు. అంతే కాకుండా వర్గాల వారీగా కూడా అమెరికా ఓటర్లలో తేడా కనిపిస్తోంది. తెల్లజాతీయులు ఎక్కువగా ట్రంప్‌కు ఓటేయగా, నల్లజాతీయులు, లాటిన్ అమెరికన్లు, ఆసియన్ అమెరికన్లు, ఇతరులు బైడెన్‌ కు ఓటేశారు. నల్లజాతీయులైతే ఏక మొత్తంగా బైడెన్ వైపు మొగ్గారు.

తెల్లజాతీయుల్లో ట్రంప్ కు 56 శాతం మద్దతు తెలపగా, కేవలం 42 శాతం మాత్రమే బైడెన్‌ కు ఓటేశారు. ఇక నల్లజాతీయుల్లో 87 శాతం ఓట్లు బైడెన్‌ కు వచ్చాయి. ఇక ట్రంప్ ‌కు అయితే కేవలం 12 శాతం మంది నల్ల జాతీయులు మాత్రమే ఓటేశారు. ముఖ్యంగా అమెరికన్ యువత బైడెన్‌ కు గట్టి మద్దతు తెలిపింది. 18-29 ఏళ్ల వయసు మధ్య వారు బైడెన్‌ వైపు వెళ్లగా, మిగిలిన వారంతా ట్రంప్ వైపే ఉన్నారు. 65 ఏళ్లు పైబడిన వారు మాత్రం 50 శాతం బైడెన్‌ కు మద్దతు ఇచ్చారు. ఇక 45-64 ఏళ్ల వయసు వారు బైడెన్ ‌కు 49 శాతం, ట్రంప్‌ కు 50 శాతం మద్దతు తెలిపారు. 30-44 మధ్య వయసు వారు 52 శాతం ట్రంప్‌ కు, 45 శాతం బైడెన్ ‌కు మద్దతు తెలిపారు.
Tags:    

Similar News