అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆధ్యాత్మిక నగరి వారణాసిలో మహిళలు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. భారతదేశం లో అత్యంత పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక నగరి అయిన వారణాసిలో మహిళలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున శివతాండవ స్త్రోత్తం పఠనంతో కాశీ వీధుల్ని మారు మ్రోగించారు. కరోనా వైరస్ నిబంధల్ని పాటిస్తూ ఫేస్ షీల్డ్ ధరించి, 1000మంది మహిళలు శివతాండవ స్త్రోత్తం పఠనంతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. వారణాసి లోసి అస్సీ ఘాట్ వద్ద వెయ్యిమందికిపైగా మహిళలు, యువతులు తమ చేతులలో దీపాలు పట్టుకుని, శివతాండవ స్త్రోత్రాన్ని పఠించారు.
దీంతో లయబద్ధంగా సాగిన శివనామ స్మరణతో ఆ ప్రాంతమంతా భక్తి పారవశ్యంతో పులకించిపోయింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు కరోనా నిబంధనలకు అనుగుణంగా ఫేస్‌షీల్డ్ ధరించారు. అలాగే కొంతమంది మహిళలు క్రీమ్ కలర్ చీరకు ఎరుపు రంగు బోర్డర్ ఉన్న్ చీరలు, మరికొందరు క్రీమ్ కలర్ చీరకు ఆకుపచ్చరంగు బోర్డర్ ఉన్న చీరలు ధరించారు. మొత్తం 80 ఘాట్లలో నిలుచున్న మహిళలంతా ఒకేసారి శివతాండవ స్త్రోత్రాన్ని పారాయణం చేశారు. మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఢిల్లీ తదితర రాష్ట్రాలకు చెందిన మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించినవారంతా మంత్రముగ్ధులయ్యారు. ముంబైకి చెందిన ఫౌండేషన్ ఆప్ హోలిస్టిక్ డెవలప్‌మెంట్ ఇన్ అకాడమిక్ ఫీల్డ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ముంబైకి చెందిన ఫౌండేషన్ ఆప్ హోలిస్టిక్ డెవలప్‌మెంట్ ఇన్ అకాడమిక్ ఫీల్డ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.