ప్రపంచంలో మరే దేశంలో సాధ్యం కానిది మన దేశంలోనే సాధ్యమవుతుందన్న విషయాన్ని వెల్లడించింది తాజాగా విడుదల చేసిన నివేదిక ఒకటి. దేశంలో మీడియా సైజు గురించి లెక్కలు వేయటంతో పాటు.. భవిష్యత్తులో దేశీయ మీడియా ఎలా ఉండనుంది?
అన్న వివరాల్నివెల్లడించింది అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ. రానున్న రోజుల్లో భారత్ లో మీడియా.. వినోద రంగాలు మరింత డెవలప్ కానున్నట్లుగా అంచనా వేశాయి. దీనికి సంబంధించిన అధ్యయన వివరాల్నివెల్లడించారు. ప్రస్తుత వార్షిక వృద్ధిరేటు 8.8 శాతం ఉండగా.. 2026 నాటికి రూ.4.3 లక్షల కోట్లకు చేరుకోనున్నట్లు పేర్కొన్నారు.
ఓవైపు సంప్రదాయ మీడియా.. మరోవైపు డిజిటల్ మీడియా.. ఇంటర్నెట్ మొబైల్ ప్రకటనలు వృద్ధి చెందటంతో ఇంత భారీగా దేశీయ మీడియా సైజు పెరగనున్నట్లు అంచనా వేసింది. అమెరికా.. జపాన్.. చైనా.. బ్రిటన్ ల తర్వాత ప్రపంచంలో ఐదో స్థానం భారత్ దేనని తాజా నివేదిక స్పష్టం చేసింది. 2022లో భారత మీడియా.. వినోద రంగాల వాటా రూ.3.14 లక్షల కోట్లు ఉండగా.. ఈ ఏడాది 11.4 శాతం వృద్ధి కనిపించనున్నట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం టీవీ ప్రకటనలు రూ.35,270 కోట్లుఉండగా.. 2026 నాటికి రూ.43,568 కోట్లకు చేరుకోవచ్చని.. దాదాపు 23.52 శాతం వృద్ధి కనిపించనున్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు.. రానున్న నాలుగేళ్లలో ఓటీటీ వీడియో సర్వీసుల విలువ రూ.21వేల కోట్లు ఉండనున్నట్లు వెల్లడించారు. ఇందులో చందాల రూపంలో రూ.19,973 కోట్లు.. రూ.1058 కోట్లు వీడియో ఆన్ డిమాండ్ ద్వారా వచ్చే వీలుందని అంచనా వేశారు.
దేశీయంగా వార్తా పత్రికల విషయానికి వస్తే.. 2.7 శాతం వృద్ధి రేటు ఉంటుందని భావిస్తున్నారు. 2021లో రూ.26.3వేల కోట్ల ఆదాయాన్ని తెచ్చి పెట్టగా.. 2026 నాటికి రూ.29.9 వేల కోట్లకు చేరుకుంటుందని ఆశిస్తున్నారు. ప్రపంచంలో మరే దేశంలో లేని విధంగా రానున్న రోజుల్లో వార్తా పత్రికల కాపీల అమ్మకాలు పెరిగే దేశాల్లో భారత్ ఒక్కటే కనిపిస్తుందని పేర్కొన్నారు. 2026నాటికి రోజువారీగా దేశం మొత్తమ్మీదా 13.9 కోట్ల వార్తా పత్రికలు అమ్ముడవుతాయన్న అంచనా వేశారు.
ఇంటర్నెట్ ప్రకటనల జోరు కొనసాగుతుందని.. 2026 నాటికి 12 శాతం వృద్ధిరేటు కనిపించి దీని సైజు రూ.28.23 వేల కోట్లకు చేరుకోనున్నట్లు వెల్లడించారు. మొత్తంగా మీడియా.. వినోద రంగాల్లో భారీ వృద్ధి రేటు ఖాయమన్న విషయాన్ని తాజా నివేదిక వెల్లడించిందని చెప్పక తప్పదు.