ప్ర‌పంచంలో 60% జ‌నాభాను కరోనా క‌బ‌ళిస్తుందా?

Update: 2020-02-11 16:06 GMT
క‌రోనా....చైనాలోని వుహాన్‌ లో పుట్టిన ఈ మ‌హ‌మ్మారి వైర‌స్ బారిన ప‌డి దాదాపు 1000 మంది మృత్యువాతప‌డ్డారు. ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా 43 వేల మందికి ఈ మాయ‌దారి వైర‌స్ సోక‌గా....వారిలో 42 వేల మంది చైనాలోనే ఉండ‌డం విశేషం. ఓ ప‌క్క క‌రోనాకు వ్యాక్సిన్ క‌నుగొనేందుకు బ్రిట‌న్ - అమెరికా - చైనాతో పాటు ప‌లు దేశాల శాస్త్ర‌వేత్త‌లు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మ‌రోప‌క్క‌, ఈ శ‌ర‌వేగంగా వ్యాపిస్తోన్న ఈ క‌రోనా పిశాచికి అడ్డుకట్ట వేసేందుకు ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాయి. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ప్ప‌టికీ.....ఈ వైర‌స్ వ్యాప్తి మాత్రం త‌గ్గ‌డం లేదు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా హాంకాంగ్‌కు చెందిన ప్ర‌ముఖ మెడిక‌ల్ ఆఫీస‌ర్ గాబ్రియ‌ల్ లియంగ్ చేసిన హెచ్చ‌రిక వెన్నులో వ‌ణుకు పుట్టిస్తోంది. సాధ్య‌మైనంత త్వ‌ర‌లో ఈ వైర‌స్ వ్యాప్తిని అడ్డుకోకుంటే ప్ర‌పంచంలో దాదాపు 60 శాతానికి పైగా జ‌నాభా ఈ వైర‌స్ బారిన ప‌డి చ‌నిపోతార‌ని లియంగ్‌ సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించారు.

క‌రోనా వ్యాప్తిని ఎంత త్వ‌ర‌గా వీలైతే అంత త్వ‌ర‌గా అరిక‌ట్టాల‌ని - దాంతోపాటు వ్యాక్సిన్‌ ను క‌నుగొనేందుకు ముమ్మర ప్ర‌య‌త్నాలు చేయాల‌ని లియంగ్‌  హెచ్చరించారు. కరోనా వైరస్‌ సోకిన ప్రతి రోగి ద్వారా మ‌రో రెండున్నర శాతం మందికి ఈ వ్యాధి సోకుతోందని లియంగ్ చెప్పారు. దాన్ని బ‌ట్టి ప్ర‌పంచ‌వ్యాప్తంగా 60 నుంచి 80 శాతం మందిని ఈ వైరస్ క‌బ‌ళించే అవ‌కాశ‌ముంద‌ని వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం మృతుల సంఖ్యకు లియంగ్ చెప్పిన గ‌ణాంకాలు స‌రిపోవడం లేదు. అయితే,  క‌రోనా మృతుల వివ‌రాలు - వైర‌స్ బారిన ప‌డ్డ వారి వివ‌రాల స‌రైన సంఖ్య‌ను చైనా వైద్యాధికారులు వెల్లడించడం లేదన్న ఆరోపణల నేప‌థ్యంలో లియంగ్ గణాంకాలు ప్ర‌పంచ దేశాల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. వైరస్‌ను గుర్తించే మెడికల్‌ కిట్లు తక్కువగా ఉన్నాయ‌ని - ల‌క్ష‌లాది ప్ర‌జ‌ల‌కు పరీక్షలు నిర్వహించాల‌ని తెలుస్తోంది.

క‌రోనా వైర‌స్‌ ను డిసెంబ‌రు నెల‌లోనే గుర్తించిన చైనా యువ వైద్యుడి మాట‌ల‌ను చైనా స‌ర్కార్ పెడ చెవిన పెట్టింది. చివ‌ర‌కు వాస్త‌వాన్ని గ్ర‌హించే స‌రికి ప‌రిస్థితి చేయి దాటిపోయింది. దీంతో, ఆ యువ వైద్యుడితో స‌హా వెయ్యి మంది క‌రోనా వ‌ల్ల మృత్యువాత ప‌డ్డారు. ఇపుడు అదే త‌ర‌హాలో లియంగ్ చేస్తున్న హెచ్చ‌రిక‌ల‌ను కూడా ప్ర‌పంచ దేశాలు సీరియ‌స్‌ గా తీసుకుంటాయా...లేక లైట్ తీసుకుంటాయా అన్న సంగ‌తి ఆస‌క్తిక‌రంగా మారింది.
Tags:    

Similar News