కరోనా జన్మస్థలంలో జోష్​.. నైట్​క్లబ్బులు, పార్టీల్లో జనం చిందులు

Update: 2020-09-21 23:30 GMT
చైనా దేశంలోని వూహాన్​ నగరంలో కరోనా పుట్టిందన్న విషయం తెలిసిందే. వూహాన్​లోని మాంసం మార్కెట్​లో ఈ వైరస్​ పుట్టిందని పలు వార్తా కథనాలు వెలువడ్డాయి. కాగా ఈ విషయన్నా చైనా ప్రభుత్వం అధికారికంగా అంగీకరించకపోయినప్పటికీ ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే మొదట్టో వూహాన్​ సిటీలో కరోనా కేసులు కూడా ఎక్కువే ఉండేవి. కానీ ప్రభుత్వం తీసుకున్న పకడ్బందీ చర్యలతో ఇప్పుడు ఆనగరంలో కేసుల సంఖ్య తగ్గింది. తగ్గడమే కారు జీరోకు వచ్చింది. ఇప్పడు వూహాన్​ సంపూర్ణంగా కరోనా ఫ్రీ సిటీ అయిపోయింది. దీంతో అక్కడి ప్రజలంతా ఎంజాయ్​ చేస్తున్నారు.. నైట్​క్లబ్బులు, పబ్​లు, బార్లలలో ఆనందంగా గడుపుతున్నారు.

ప్రపంచదేశాలన్నీ కరోనా మహమ్మారితో విలవిలలాడుతుంటే .. కరోనా జన్మస్థలమైన వూహాన్​లో మహమ్మారి జాడే లేదు. అక్కడ ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు మాస్కులు పెట్టుకోవడం లేదు. భౌతికదూరం కూడా పాటించడం లేదంటే పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పడు వుహాన్‌లోని నైట్ క్లబ్బులన్నీ హౌస్​ఫుల్​ అవుతున్నాయి. వీకెండ్​ వచ్చిందంటే చాలు యువత పబ్​లకు వెళ్తున్నారు. ఫ్లోర్ల మీద డాన్స్​లు, హగ్గులు, ముద్దులతో రెచ్చిపోతున్నారు. సుమారు 11 మిలియన్ల జనాభా ఉన్న వుహాన్‌లో పదుల సంఖ్యలో పబ్బులు, నైట్ క్లబ్బులు ఉన్నాయి.

టెస్టులు చేస్తూనే ఉన్నారు..
ప్రజలెవరికీ కరోనా లక్షణాలు లేకపోయినప్పటికీ అక్కడి ప్రభుత్వం మాత్రం రోజుకు వేలసంఖ్యలో కరోనా టెస్టులు చేస్తున్నది. అయితే ప్రస్తుతం ఒక్కపాజిటివ్​ కేసు కూడా నమోదు కావడం లేదట. గత 33 రోజులుగా వేలసంఖ్యలో కరోనా పరీక్షలు చేసినప్పటికి ఒక్క పాజిటివ్​ కేసు కూడా నమోదు కాలేదు. దీంతో ప్రస్తుతం వూహాన్​ను కరోనా ఫ్రీస్టేట్​గా ప్రకటించారు. మరోవైపు మిగిలిన దేశాలతో పోల్చుకుంటే.. చైనాలో కరోనా మరణాలు సంఖ్య చాలా తక్కువగా ఉన్నది. దేశవ్యాప్తంగా కరోనాతో మృతిచెందిన వారిసంఖ్య కేవలం ఐదువేలే. మొత్తం కేసులు 85,291 కాగా.. 80,484 మంది రికవర్ అయ్యారు. ప్రస్తుతం అక్కడ ఉన్న యాక్టివ్ కేసులు 173 మాత్రమే.
Tags:    

Similar News