దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఇప్పటికే దేశంలో 28,380 కేసులు దాటాయి. 886మంది ఇప్పటివరకు దేశంలో మరణించారు. దేశంలో ఈ వేగవంతమైన పెరుగుదల ఆరోగ్య నిపుణులను, ప్రభుత్వాన్ని, పౌరులను ఆందోళనకు గురిచేస్తోంది.
అయితే శాస్త్రవేత్తలు.. వైద్యులు ఈ వైరస్ వ్యాప్తి గురించి పరిశోధన చేసినప్పుడు కీలక విషయం వెలుగుచూసింది. తాజాగా దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్ర, గుజరాత్ లలో కేసులు.. మరణాలు సంభవించడానికి కారణం కరోనా వైరస్ లోని ‘సార్స్-కోవిడ్2’ అనే స్టెరాయిన్ జాతి వైరస్ అని తేల్చారు. మహారాష్ట్ర, గుజరాత్ లలో ఈ వైరస్ కనుగొనబడిందని.. ఇదే అత్యధిక ప్రభావవంతమైందని తేల్చారు.
తాజాగా గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ పరిశోధనలో కరోనా వైరస్ యొక్క ఎంతో పవర్ ఫుల్ అయిన ‘ఎల్ టైప్ స్టెరాయిన్’ వల్లే రాష్ట్రంలో మరణాల సంఖ్య పెరుగుతోందని పేర్కొంది.
మార్చి ప్రారంభంలో చైనాలో పుట్టిన ఈ వైరస్ పై అధ్యయనం చేశారు. ఇందులో కరోనా వైరస్ యొక్క రెండు ప్రధాన రకాలు ఉన్నాయని పెకింగ్ యూనివర్సిటీ, షాంఘై ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అంటువ్యాధుల విభాగం నిపుణులు కనిపెట్టారు. ఆ రెండు కరోనా జాతులను ఎస్ టైప్, ఎల్ టైప్ గా గుర్తించారు.
‘ఎల్’ రకం కరోనా వైరస్ చాలా దూకుడుగా ఉంటుందని తెలిపారు. వ్యాప్తి ప్రారంభ దశలలో ఈ వైరస్ చాలా ఎక్కువగా ప్రబలంగా వ్యాపిస్తుందని తేల్చారు. మనవులకు అత్యధికంగా సోకే వైరస్ గా ఇది గుర్తింపు పొందింది. ఎల్ టైప్ వైరస్ తోనే ఇటలీ, స్పెయిన్, న్యూయార్క్ లలో అత్యధిక మరణాలు సంభవించాయని గుర్తించారు. సో ‘ఎల్’ టైప్ వైరస్ అత్యంత డేంజర్ అని గుర్తించారు. దీంతో పోలిస్తే ‘ఎస్’ టైప్ కరోనా వైరస్ చాలా నెమ్మదిగా వ్యాపిస్తుందని తేల్చారు.
ప్రస్తుతం మహారాష్ట్ర, గుజరాత్ లలో రోగులకు సోకిన వైరస్ ‘ఎల్’ టైప్ గా గుర్తించారు. ఈ డేంజర్ వైరస్ అత్యధిక కేసులు, మరణాలకు కారణమవుతుందని కనిపెట్టారు. తాజాగా బయటపడ్డ ఈ కొత్త విషయంతో ఆ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు, వైద్యులు ఆందోళన చెందుతున్నారు.