యడ్డి ఇలా అడ్డంగా దొరికావేంటి ..కారణం అమిత్ షానేనా ?

Update: 2019-11-05 06:41 GMT
పాపం ఈ మధ్య రాజకీయ నేతలకి అసలు టైం బాగుండటం లేదు. ఎక్కడో సీక్రెట్ గా కూర్చొని కొంతమంది సమక్షంలో మాట్లాడిన మాటలు కూడా  వీడియోలతో సహా బయటకి వస్తుండటం తో తలలు పట్టుకుంటున్నారు. గత ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి , చంద్రబాబు డబ్బు తో ఎమ్మెల్యేలని కొనేందుకు ప్రయత్నం చేస్తునట్టు వీడియో వచ్చిన విషయం తెలిసిందే. ఆ వీడియో దేశ వ్యాప్తంగా పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. ఇదే విధంగా తాజాగా కర్ణాటక సీఎం యడ్డ్యూరప్ప మాట్లాడిన మాటలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అసలు యడ్డ్యూరప్ప ఏం మాట్లాడారు ? ఆ వీడియో లో ఏముంది? అనే విషయాలని చూద్దాం..

కర్ణాటక లో కాంగ్రెస్ ,  జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం పడిపోయిన తారువాత బీజేపీ అధికారం చేపట్టి వంద రోజులవుతోంది. బీజేపీ కార్యకర్తలంతా ఆ సంబరాల్లో ఉన్న సమయంలో బయటకొచ్చిన యడ్యూరప్ప వీడియో క్లిప్ కన్నడనాట సంచలనం రేపుతోంది. ఇప్పటి సీఎం యడ్యూరప్ప అప్పటి బీజేపీ నేతలతో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.అప్పటి జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన రెబల్ ఎమ్మెల్యేల గురించిన సంచలన అంశాలు ఆ క్లిప్‌ లో ఉన్నాయి.

కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వాన్ని కూల్చడానికి అమిత్‌ షా ఆదేశాల మేరకే ఆపరేషన్ కమల్ జరిగిందని ఈ మాటలు వింటే స్పష్టం అవుతుంది. కాంగ్రెస్, జేడీఎస్‌ లకు చెందిన మొత్తం 17 మంది రెబల్ ఎమ్మెల్యేలు గత ప్రభుత్వం సంక్షోభంలో ఉన్న సమయంలో,  పార్టీ పెద్దలకు, కుటుంబ సభ్యులకు అందుబాటులో లేకుండా ముంబైలోని ప్రఖ్యాత హోటళ్లలో ఉన్నారు.బీజేపీయే రెబల్ ఎమ్మెల్యేలతో ఈ క్యాంప్ నిర్వహించినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ , అప్పుడు బీజేపీ నేతలు ఆ విమర్శలని ఖండించారు.  కానీ, వారందరినీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యవేక్షణలోనే తాను ముంబైలో ఉంచానని కార్యకర్తలతో యడ్యూరప్ప చెబుతున్న విషయం ఆ క్లిప్పింగ్లో స్పష్టంగా ఉంది. ఇది తానో మరో రాష్ట్ర నాయకుడో తీసుకున్న నిర్ణయం కాదని, అంతా అమిత్ షానే చేశారని కుండబద్దలు కొట్టారు యడ్డీ. ఈ పరిణామాలపై సీఎం యడ్యూరప్ప తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు, కన్నడ నాట ఇప్పుడీ క్లిప్పింగ్  హాట్ టాపిక్ .

కానీ , ఈ  ఆరోపణలను సీఎం యడ్యూరప్ప ఖండించారు.
Tags:    

Similar News