కర్ణాటకలో ముఖ్యమంత్రి ముచ్చట తీర్చుకుంటున్న యడ్యూరప్పు కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తున్నారా? ఆయన కేవలం సీఎం అనే హోదాలో ఉన్నా, వ్యవహారాలను నడిపించేది మాత్రం వేరే వాళ్లా? ఇప్పుడు ఈ చర్చే జరుగుతూ ఉంది. యడ్యూరప్పు ను కాదని మరొకరిని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టలేకపోయింది బీజేపీ అధిష్టానం. 75 యేళ్ల వయసు మించిన వాళ్లు కీలక పదవుల్లో ఉండకూడదని బీజేపీ అధిష్టానం ఒక నియమాన్ని పెట్టుకున్నా, ఆ మేరకు కొందరు నేతలను కేబినెట్ నుంచి తప్పించినా.. ఆ వయసు దాటిన యడ్యూరప్పు కు సీఎం పీఠాన్ని అప్పగించారు. ఈ విషయంలో మోడీ-అమిత్ షాలు కూడా ఏం చేయలేకపోయారు.
అది కూడా ప్రజలేమీ యడ్యూరప్పుకు మెజారిటీ ఇవ్వలేదు. కాంగ్రెస్-జేడీఎస్ ల ప్రభుత్వాన్ని కూలగొట్టి బీజేపీ అక్కడ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. అయినా పగ్గాలు మాత్రం యడ్యూరప్పుకే దక్కాయి. ఆయనను కాదనలేకపోయింది బీజేపీ హై కమాండ్.
అయితే.. ముగ్గురు డిప్యూటీ సీఎంలను నియమించింది. తద్వారా పగ్గాలు వేసిందని వార్తలు వచ్చాయి. అలాగే కేబినెట్లో ఎవరుండాలనే అంశం పై కూడా యడ్యూరప్పుకు పెద్ద స్వాతంత్రం లేకపోయిందంటారు. అమిత్ షా ఆమోద ముద్ర తర్వాతే కేబినెట్ ను ఏర్పాటు చేశారు.
ఆ సంగతంతా అలా ఉంటే.. యడ్యూరప్పు కు ఉన్న కొద్ది పాటి పవర్ ను కూడా ఆయన తనయుడే నియంత్రిస్తూ ఉన్నారని టాక్. ముఖ్యమంత్రిగా ఇప్పుడు యడ్యూరప్పు ఎలాంటి నిర్ణయాలనూ తీసుకోవడం లేదని, ఆయన తనయుడే అన్నీ నిర్ణయిస్తాడని ప్రచారం జరుగుతూ ఉంది. యడ్యూరప్పుకు వయసు మీద పడటంతో.. ఆయన తయుడు రాఘవేంద్ర అన్ని వ్యవహారాలనూ సమీక్షిస్తున్నారని, ఎమ్మెల్యే హోదాలో ఉన్న ఆయన.. సీఎంవోను తన కసుసన్నల్లో నడిపిస్తున్నారని కర్ణాటకలోని ప్రతిపక్ష పార్టీలు వ్యాఖ్యానిస్తూ ఉన్నాయి. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం అని బీజేపీ చెప్పుకుంటుందని.. అయితే, యడ్యూరప్పు తనయుడు చేస్తున్నదాన్ని ఏమనాలి? అని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే బీజేపీ ఈ ఆరోపణలపై స్పందించడం లేదు.