షాకింగ్ నిజాన్ని చెప్పిన యేల్.. హార్వర్డ్ మెడికల్ స్కూల్ రిపోర్టు
మహమ్మారి దెబ్బకు దిమ్మ తిరిగిపోతున్న వైనం తెలిసిందే. ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాలకు చుక్కలు చూపిస్తున్న ఈ మాయదారి రోగం.. ఇప్పుడు భారత్ ను ఎంతలా పట్టి పీడిస్తున్నదో తెలిసిందే. రోజుకు పదిహేను వేల కేసులకు తగ్గకుండా కొత్తవి నమోదవుతున్నాయి. రోజులు గడిచే కొద్దీ.. కేసుల నమోదు పెరుగుతున్నాయే తప్పించి.. తగ్గని పరిస్థితి. ఇదే రీతిలో సోకితే భారత్ లో తీవ్ర పరిణామాలు తప్పవంటున్నారు. అంతేకాదు.. దేశంలోని వేశ్యావాటికలు మహమ్మారికి హాట్ స్పాట్ లుగా మారే ప్రమాదం ఉందంటున్నారు.
యేల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్.. హార్వర్డ్ మెడికల్ స్కూల్ విద్యావేత్తల అధ్యయనం ప్రకారం వేశ్యావాటికల్ని మరికొంత కాలం మూసేయటం ద్వారా మహమ్మారికి చెక్ పెట్టే వీలుందని చెబుతున్నారు. సెక్స్ వర్కర్ల ద్వారా మాయదారి రోగం మరింతగా వ్యాప్తి చెందే వీలుందని చెబుతున్నారు. సంభోగ సమయంలో వైరస్ సోకిన వ్యక్తులతో ఇతరులకు చాలా త్వరగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందంటున్నారు.
తెలంగాణలోని వేశ్యా వాటికలు అతి పెద్ద హాట్ స్పాట్ లుగా మారే అవకాశం ఉందంటున్నారు. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి అని చెబుతున్న ఈ అధ్యయనం.. లాక్ డౌన్ ముగిసే వరకూ వాటిని మూసి వేసేలా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. వేశ్యా వాటికలు మహమ్మారికి అతి పెద్ద హాట్ స్పాట్లుగా నిలిచే అవకాశం ఉందంటున్నారు. ఈ విషయంపై ప్రభుత్వాలు.. అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపించి అవగాహన కల్పించే ప్రమాద ముప్పు కొంతమేర తగ్గే వీలుంది.