ఆటలో సత్తా చూపాల్సిన క్రీడాకారిణి.. పాడు పనులకు పాల్పడి అడ్డంగా బుక్ అయిన ఉదంతమిది. రష్యాకు చెందిన టెన్సిస్ ప్లేయర్ యానా సెజికోవాను ఫ్రెంచ్ పోలీసులు అరెస్టు చేశారు. దీనికి కారణం ఆమె మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడినట్లుగా ఆరోపణలు రావటమే. సిజికోవా డబుల్స్ క్రీడాకారిణిగా పేరుంది. టెన్సిస్ ర్యాంకింగ్ లో సిజికోవా డబుల్స్ ర్యాంకింగ్ 101.
ఆమె వ్యవహారశైలి సిత్రంగా ఉంటుందని చెబుతారు. ఈ ఏడాదిలో ఇప్పటికి ఐదు నెలలు మాత్రమే గడిచాయి. కానీ.. ఆమె ఇప్పటికి ఏడుగురు పార్టనర్స్ ను మార్చేసి టోర్నీలో పాల్గొనటం గమనార్హం. సాధారణంగా డబుల్స్ ఆడే క్రీడాకారులు ఎవరైనా సరే.. తమకు తగ్గ జోడిని వెతుక్కుంటారు. అంతే తప్పించి.. టోర్నీకి ఒకరిని చొప్పున మార్చుకుంటూ పోరు. ఒకవేళ.. మార్చినా ఇంత పెద్ద ఎత్తున మార్చటం చాలా అరుదుగా చెబుతున్నారు.
గత ఏడాది ఆమె పాల్గొన్న డబుల్స్ మ్యాచ్ లో ఆమె మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడిందని.. అందుకే కావాలని ఓడినట్లుగా ఆమె మీద ఆరోపనలు ఉన్నాయి. ఈ ఏడాదిలో కూడా ఆమె పాల్గొన్న టోర్నీలోని తొలి రౌండ్ లోనే ఓడారు. గత ఏడాది సిజికోవా - మాడిసన్ బ్రెంగ్లీ జంట తొలి రౌండ్ లోనే ఓడారు. ఆ గేమ్ లో రెండో సెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడినట్లుగా పోలీసులు తేల్చారు. ఆమెపై ఉన్న ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు ఫ్రెంచ్ పోలీసుల వద్ద ఉన్నాయని.. అందుకే ఆమెను అదుపులోకి తీసుకొని అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. కష్టపడి చక్కగా ఆడి పేరు ప్రఖ్యాతులతో పాటు ఫ్రైజ్ మనీని సొంతం చేసుకోవాలే కానీ.. ఇలా అడ్డదారిలోకి వెళితే.. ఏ రోజైనా బుక్ కావటం ఖాయం. ఇందుకు సిజికోవా ఉదంతమే పెద్ద ఉదాహరణగా చెప్పక తప్పదు.