'మంచి సీఎం కాదు ముంచే సీఎం'..జగన్ పాలనపై టీడీపీ బుక్

Update: 2019-11-30 12:40 GMT
ఆరు నెలల వైసీపీ పాలనలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఆరు నెలల జగన్‌ పాలనపై యనమల ఈ రోజు ఒక పుస్తకం విడుదల చేశారు. జగన్‌ కు ఒక్క ఛాన్స్‌ ఇస్తే ప్రజలను మోసం చేశారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే ప్రతిపక్షాలను టార్గెట్‌ చేశారన్నారు. ఏ హామీ పరిపూర్ణంగా అమలు చేయలేదన్నారు. సహజవనరుల దోపిడి జరిగి రెవెన్యూ పడిపోయిందన్నారు. పథకాల ప్రకటన తప్ప సోర్స్‌ సీఎంకు తెలియడం లేదు. ఈ ఏడాదిలోనే రూ.62వేల కోట్లు అప్పు చేసేందుకు సిద్ధమయ్యారన్నారు. ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు ఇవ్వలేక పోతున్నారన్నారు. గుణపాఠం చెప్పడానికి ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు.

'మంచి సీఎం కాదు.. జనాన్ని ముంచే సీఎం' పేరుతో యనమల ఈ పుస్తకాన్ని రిలీజ్‌ చేశారు. ''మాట తప్పారు..మడమ తిప్పారు'. ఇచ్చిన పథకాల కంటే రద్దు చేసిన పథకాలే ఎక్కువంటూ విమర్శించారు. ఇప్పటికే 62వేల కోట్లు అప్పు చేశారు. ఉద్యోగుల జీతభత్యాలు కూడా చెల్లించలేని స్థితికి తెచ్చారంటూ యనమాల ఆరోపణలు చేశారు. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే జగన్‌..అవినీతిని అరికడతారా? అంటూ ప్రశ్నించారు. మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ పాటికి రాజధానిలో నిర్మాణాలు పూర్తి చేసేవాళ్లమన్నారు యనమల.

కాగా టీడీపీ మహిళా నాయకురాలు పంచమర్తి అనూరాధ ఈ పుస్తకంలోని ఒక పేజీని ట్వీట్ చేస్తూ ‘‘జగన్ గారి ఆరు నెలల పాలనపై ప్రపంచం ఏమంటుంది.. పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు.. చెప్పు తీసుకుని కొట్టుకోవడం తప్ప’’ అన్నారు.



Tags:    

Similar News