ఏపీ సీఎస్ పై టీడీపీ మరోసారి ఫైర్!

Update: 2019-04-21 15:17 GMT
ఇప్పటికే ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంపై తెలుగుదేశం పార్టీ బహిరంగంగానే ఫైర్ అయ్యింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన విషయంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎల్వీ పై గతంలో నమోదైన కేసులను ప్రస్తావిస్తూ బాబు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఆ వ్యాఖ్యలపై ఎల్వీకి పలువురు బాసటగా నిలిచారు. మాజీ ఐఏఎస్ లు కూడా బాబు పై ఆ విషయంలో విమర్శలు చేశారు.

ఎన్నికల వేళ పునేఠాను సీఎస్ హోదా నుంచి బదిలీ చేసి కేంద్ర ఎన్నికల సంఘం ఎల్వీ సుబ్రమణ్యంను ఆ హోదాలోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అది తెలుగుదేశం పార్టీకి ఏ మాత్రం ఇష్టం లేదని అంశం. అది స్పష్టం అవుతూనే ఉంది. మరోవైపు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న వేళ సీఎస్ తీరు టీడీపీని మరింత ఇబ్బంది పెడుతున్నట్టుగా ఉంది.

అందుకే ఆయన మీద తెలుగుదేశం నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. సీఎస్ గా ఎల్వీ సుబ్రమణ్యం నియామకాన్నే తప్పుపట్టారు యనమల. ఇక వివిధ శాఖల వ్యవహారాల్లో సీఎస్ జోక్యాన్ని కూడా యనమల తీవ్రంగా తప్పు పట్టారు. ప్రధాన కార్యదర్శిగా ఎల్వీ సుబ్రమణ్యం సర్వీస్ రూల్స్ ను అతిక్రమిస్తున్నారని విమర్శించారు. ఆర్థిక శాఖ వ్యవహారాలపై సీఎస్ సూచనలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. నిధుల సమీకరణ - విడుదల విషయంలో మంత్రివర్గ నిర్ణయాలే ఫైనల్ అని యనమల పేర్కొన్నారు.

ఈ మేరకు యనమల ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. మొత్తానికి కోడ్ అమల్లో ఉన్న సమయంలో సీఎస్ తీరు తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెడుతున్నట్టుగా ఉంది!

Tags:    

Similar News