తెలుగుదేశం పార్టీ... తీవ్రమైన అంతర్మథనంలో ఉందా? ఒత్తిడిలో ఉందా? కచ్చితంగా అవును అని తాజా పరిణామాలు అన్నీ దానికి స్పష్టమైన సమాధానం ఇస్తున్నాయి. కర్ణాటక ఎన్నికల గురించి ఆ ఎన్నికలకు ముందు బీజేపీ భారీ అంచనాలతో ఉంది కాబట్టి వారిలో పెద్ద టెన్షన్ లేదు. కానీ కాంగ్రెస్ - జేడీఎస్ మాత్రం బాగా ఒత్తిడికి గురయ్యాయి. విచిత్రమేంటంటే... ఆ ఎన్నికల గురించి వాటిలో పోటీ చేస్తున్న ఆ పార్టీల కంటే కూడా చంద్రబాబు ఎక్కువ ఒత్తిడికి గురయ్యారు. టీడీపీ శ్రేణులు కర్ణాటకలో కాంగ్రెస్ జరిగాయని పలుచోట్ల పూజలు చేయించారంటే ఇక పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలుగుదేశం పుట్టిందే కాంగ్రెస్ మీద కోపంతో! ఎన్టీఆర్ టీడీపీ పార్టీ స్థాపించడానికి అదే ప్రధాన కారణం. అలాంటి పార్టీ ఈరోజు తన పుట్టు శత్రువు విజయం కోసం తహతహలాడింది.
కాంగ్రెస్ గెలవాలని టీడీపీ ఈ స్థాయిలో కోరుకుంటూ ఉండటంతో పార్టీకి జరుగుతున్న డ్యామేజ్‌ను గమనించిన చంద్రబాబు కర్ణాటక ఎన్నికలకు ఒక్క రోజు ముందు జరిగిన తిరుపతి సభలో నేను బీజేపీకి ఓటు వేయొద్దని మాత్రమే చెప్పాను అని ఎవరూ అడగని ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు. ఎవరూ అడగలేదా అంటూ వారిని ఎవరూ అడగలేదు. కానీ సోషల్ మీడియా కాంగ్రెస్‌పై బాబు ప్రేమ తెగ ప్రచారం అయ్యి అది పార్టీ ఆఫీసు దాకా చేరింది. దీంతో బాబు నోరు విప్పక తప్పలేదు. కానీ... అక్కడితో ఆ వ్యవహారం ఆగలేదని ఈరోజు యనమల చేసిన వ్యాఖ్యలతో స్పస్టమైంది. రోజురోజుకు పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతతో టీడీపీలో ఒత్తిడి కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. ఒకవైపు పవన్ కళ్యాణ్ దూరమయ్యాడు. బీజేపీ దోస్తీ చెడింది. దీంతో బీజేపీ బహిరంగంగా చంద్రబాబుకు కర్ణాటక తర్వాత మీ అంతు చూస్తాం అని వార్నింగ్ ఇవ్వడంతో టీడీపీలో వణుకు మొదలైంది. దీంతో తన బద్ధ శత్రువు కాంగ్రెస్‌తో కలవడానికి కూడా చంద్రబాబు వెనుకావడటం లేదు. కానీ అది బహిరంగపర్చడం కూడా ఇష్టం లేదు. ముందు నుయ్యి వెనుక గొయ్యిలా ఉంది పరిస్థితి.
ఇదిలా ఉండగా... యనమన ఈరోజు కొత్త చర్చకు దారితీశాడు. గతంలో బిజెపి నేతలతో సుజనా చౌదరి భేటి గురించి అతనే జనానికి చెప్పి - అతనే వివరణ ఇచ్చి అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచిన యనమనల తాజాగా చంద్రబాబు కర్ణాటక టూరు సడెన్ గా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. *కర్ణాటకకు చంద్రబాబు కాంగ్రెస్ పిలిస్తే వెళ్లలేదని కేవలం జేడీఎస్ ప్రత్యేక ఆహ్వానం మేరకే చంద్రబాబు బెంగళూరు వెళ్లారని* చెప్పారు. కాంగ్రెస్ పిలిస్తే వెళ్లారన్న మరి యనమలతో ఎవరన్నారో తెలియదు గానీ సీఎం కుమారస్వామి అందరినీ పిలిచినట్టే చంద్రబాబును కూడా పిలిచాడు. యనమల వ్యాఖ్య చూస్తుంటే... ఇపుడే అర్థమవుతోంది లక్ష్మీపార్వతి చెప్పినట్టు కాంగ్రెస్ కు అసలైన పిల్లకాంగ్రెస్ గా టీడీపీ మారిందేమో అని.