వెంక‌య్య‌కు ఘాటు పంచ్ ఇచ్చిన య‌న‌మ‌ల‌

Update: 2017-06-24 07:32 GMT
రుణమాఫీ ఫ్యాషన్‌ గా మారిందని ఇటీవల కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర ఆర్థిక యనమల రామకృష్ణుడు గ‌ట్టి కౌంట‌రే ఇచ్చారు. వెలగపూడి సచివాలయంలో శుక్రవారం యనమల విలేఖరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు వ్యాఖ్యల గురించి విలేఖరులు ప్రస్తావించ‌గా రుణమాఫీ అనేది ఫ్యాషన్ కాదని, అవసరమని స్పష్టం చేశారు. వ్య‌వ‌సాయంలో ఇక్క‌ట్లు ఎదుర్కొంటున్న రైతుల‌కు రుణ‌మాఫీ ఆస‌రాగా నిలుస్తోంద‌ని, దీన్ని గ‌మ‌నించాల‌ని య‌న‌మ‌ల గుర్తు చేశారు.

రైతులకు రుణమాఫీ అన్నది తెలుగుదేశం పార్టీ విధానంలో భాగమని య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు  తెలిపారు. ఎన్డీయే ప్రభుత్వ హయాంలో కూడా ఎన్టీఆర్ అమలు చేశారని గుర్తు చేశారు. దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రం రైతులకు రుణమాఫీ అమలు చేసిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో అమలు చేసిన తరువాత దీనిని కొన్ని రాష్ట్రాల్లో అమలు చేశారని య‌న‌మ‌ల అన్నారు. ఇటీవ‌ల జ‌రిగిన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నికల్లో ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీ కూడా రుణ‌మాఫీ హామీని ప్రకటించార‌ని య‌న‌మ‌ల అన్నారు. కాగా, అన్న‌దాత‌ల విష‌యంలో కేంద్రమంత్రి వెంక‌య్య‌నాయుడు చేసిన వ్యాఖ్య‌లకు య‌న‌మ‌ల ఇంత ఘాటు కౌంట‌ర్ ఇవ్వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News