'యాత్ర‌-2' సైలెంట్ గా త‌వ్వి తీస్తున్నారా?

Update: 2022-11-04 02:30 GMT
ఇటీవ‌లే సంచ‌ల‌నాల రాంగోపాల్ వ‌ర్మ `వ్యూహం` అంటూ స‌ర్ ప్రైజ్ చేసిన‌ సంగ‌తి తెలిసిందే. 2024 ఎన్నిక‌ల కాక‌ముందు వ‌ర్మ వ్యూహం ఏంటి? అంటూ ఇండ‌స్ర్టీ స‌హా జ‌నాల్లో  వ్యూహాం హాట్ టాపిక్ గా మారింది. వ‌ర్మ వ్యూహం ఎలా ఉండ‌బోతుంది? అన్న‌ ఎగ్జైట్ మెంట్ ఓ సెక్ష‌న్ ఆడియ‌న్స్ లో అప్పుడే మొద‌లైపోయింది. స‌రిగ్గా ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో భేటి అనంత‌రం వ్యూహం ప్ర‌క‌టించ‌డం రాజ‌కీయంగానూ ఆస‌క్తిక‌రంగా మారింది.

మ‌రి ఆ వ్యూహం సంగ‌తేంటో తేలాలంటే ఇంకొన్ని నెల‌లు ఆగాల్సిందే. ఈ నేప‌థ్యంలో తాజాగా దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎజ్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి `యాత్ర` సైతం తెరపైకి వ‌స్తోంది. వైఎస్ఆర్ పాద యాత్ర నేప‌థ్యంలో మ‌హి . వి.రాఘ‌వ ఇప్ప‌టికే `యాత్ర` చిత్రాన్ని తెర‌కెక్కించి స‌క్సెస్ అందుకున్న సంగ‌తి తెలిసిందే. వైఎస్  పాత్ర‌లో మ‌ల‌యాళ న‌టుడు మ‌మ్ముట్టి న‌టించి ఆద్యంతం ఆక‌ట్టుకున్నారు. ఆ పాత్ర‌లో న‌టించ‌డం అదృష్టంగా భావించారు.

ఆ సినిమా హిట్ తో వైఎస్సార్ కి ఘ‌న‌మైన నిశాళీ ద‌క్కింది. అదే స‌మ‌యంలో యాత్ర‌-2 కూడా  ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆ త‌ర్వాత మ‌హి వేర్వేరు సినిమాలతో బిజీ అవ్వ‌డంతో యాత్ర‌-2 పై సీరియ‌స్ గా ఆలోచ‌న చేయ‌లేక‌పోయారు. కానీ ఏపీలో తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో యాత్ర‌-2 తెర‌కెక్కించే దిశ‌గా జోరుగా పావులు క‌దుపుతున్న‌ట్లు తెలిసింది.

ఇప్ప‌టికే `యాత్ర‌-2` క‌థ సిద్ద‌మైంది. ఇప్పుడా క‌థ‌కి అవ‌స‌రం మేర మెరుగులు దిద్దుతున్న‌ట్లు..క‌థ‌ని ఇంకా బ‌లంగా చెప్ప‌డానానికి అవ‌స‌ర‌మైన స‌న్నివేశాల్లో మార్పులు చేస్తున్న‌ట్లు లీకులందుతున్నాయి. తొలి భాగాన్ని నిర్మించిన  రెడ్డి సామాజికి వ‌ర్గానికి చెందిన ఓ బ‌డా వ్యాపార‌ వేత్త ఈ చిత్రాన్ని నిర్మించ‌డానికి ముందుకొస్తున్న‌ట్లు స‌మాచారం.

మొద‌టి భాగాన్ని  విజ‌య్ చిల్లా...శ‌షి దేవి రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. అయితే ఈసారి వారు భాగ‌స్వామ్యం అవుతారా?  లేదా? అన్న దానిపై క్లారిటీ లేదు. కానీ  సినిమాని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించాల‌ని పావులు కదుపుతున్నారు. ఈ విష‌యంలో ద‌ర్శ‌కుడు మాత్రం  వేగం పెంచిన‌ట్లు క‌నిపిస్తోంది. `యాత్ర` రిలీజ్ అనంత‌రం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి....మ‌హి. విరాఘ‌వ‌ని ఇంటికి ఆహ్వానించి స‌న్మానించారు.  సినిమా చూసి ప్ర‌శంసించారు. యాత్ర‌-2 కూడా చేయాల‌ని అభిలాషించారు. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల ముందు `యాత్ర‌-2` ఖాయంగానే కనిపిస్తోంది. వ‌ర్మ `వ్యూహం` ప్ర‌క‌టించిన  నేప‌థ్యంలో `యాత్ర‌-2` ప్ర‌క‌ట‌న కూడా ఏ క్ష‌ణ‌మైనా వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని గెస్సింగ్స్  తెర‌పైకి వ‌స్తున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News