షాకింగ్ ప్రమాదం ఒకటి చోటు చేసుకుంది. ఏపీ అధికారపక్ష ఎమ్మెల్యే సోదరుడి కారు అనూహ్య ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం నుంచి ఎమ్మెల్యే సోదరుడి కొడుకు బయటపడగా.. ఆయన కుటుంబ సభ్యులు గల్లంతైన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. అనూహ్య ప్రమాదానికి గురైన కారులోని వారి కోసం ఇప్పుడు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు.
ఇంతకూ అసలేం జరిగిందన్న వివరాల్లోకి వెళితే..
మంగళవారం రాత్రి గుంటూరు జిల్లా దుర్గి మండలం వద్ద అనూహ్య ప్రమాదం చోటు చేసుకుంది. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే కమ్ ప్రభుత్వ విప్ గా వ్యవహరిస్తున్న పిన్నెల్లి రామక్రిష్ణా రెడ్డి చిన్నాన్న కుమారుడు మదన్ మోమన్ రెడ్డి కుటుంబం కారులో వెళుతున్నారు. వారి కారు దుర్గి మండలం అడిగొప్పుల వద్దకు వచ్చినంతనే అదుపు తప్పింది.
కన్నుమూసి లేచేసరికి కారు కాస్తా సాగర్ కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగినంతనే స్పందించిన స్థానికులు వెంటనే.. కాలువలోకి దుమికారు. మదన్ మోహన్ రెడ్డిని సురక్షితంగా కాపాడారు. అయితే.. కారులో ఆయన సతీమణి.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారు గల్లంతుకావటంతో.. వారి కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. కారును తీసేందుకు ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి.
ప్రమాద ఘటన గురించి సమాచారం తెలిసినంతనే.. పోలీసులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం ఇప్పుడు షాకింగ్ గా మారటంతో పాటు.. కళ్ల ఎదుట కుటుంబ సభ్యులు మిస్ కావటాన్ని మదన్ మోహన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు.