నాయాల... ట్రాన్స్‌ఫర్ చేయిస్తా.. మా పార్టీ ఓళ్లకే పథకాలివ్వవా? వైసీపీ ఎమ్మెల్యే బూతులు
ఏపీలో అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యేలు. అయితే.. ప్రజల మీద.. లేకపోతే.. అధికారుల మీద తమ అసహనం ప్రదర్శిస్తున్నారు. దీంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం అభాసు పాలవుతోంది.
తాజాగా.. వైసీ పీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు మండల మెజిస్ట్రేట్ కం.. తహసీల్దార్‌పై విరుచుకుపడ్డారు. బూతులు తిట్టారు. '' మా పార్టీ వోళ్లకే కార్దివ్వవా.. నువ్వేం తహసీల్దార్ ట్రాన్స్‌ఫర్ చేయిస్తా'' అని ఊగిపోయారు.
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం గాండ్లపల్లె సచివాలయం పరిధిలో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంఎస్ బాబు అధికారులను తిట్టిపోశారు. అందరి ముందు పరుష పదజాలంతో తిట్టడంతో వీఆర్వో రవి కన్నీరుపెట్టుకుంటూ వెళ్లిపోయారు.
నొచ్చుకున్న అధికారుల కు మండల నాయకులు నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం గాండ్లపల్లె సచివాలయం పరిధిలో మంగళవారం నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంఎస్ బాబు అధికారులపై ఫైరయ్యారు.
అందరి ముందు పరుష పదజాలంతో తిట్టడంతో వీఆర్వో రవి కన్నీరు పెట్టుకుంటూ వెళ్లిపోయారు. తహసీల్దారు మనస్తాపానికి గురయ్యారు. మండలంలోని కాళేపల్లె గ్రామంలో కొందరు భూమి, బియ్యంకార్డు సమస్యలు చెప్పడంతో ఊగిపోయిన ఎమ్మెల్యే ''మా పార్టీ వారికే న్యాయం చేయకపోతే ఎలా?'' అంటూ రెవెన్యూ అధికారులను తిట్టారు. తహసీల్దారును బుద్ధి ఉందా? లేదా? అనడంతో పాటు.. వీఆర్వోను ఏకంగా బూతులు తిట్టారు.
బాధ్యతలు చేపట్టి నెల రోజులు కూడా కాకపోవడంతో పూర్తి స్థాయిలో పట్టులేదని, సమస్యలు పరిష్కరిస్తామని వీఆర్వో చెబుతున్నా ఏమాత్రం పట్టించుకోలేదు. అనంతరం గాండ్లపల్లెలో ఒక కుటుంబానికి ఇవ్వాల్సిన ప్రభుత్వ పథకాల నివేదికను మరో కుటుంబానికి ఇవ్వడంతో వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిని 'కడుపునకు ఏం తింటున్నారు'' అని విరుచుకుపడ్డారు. నొచ్చుకున్న అధికారులకు మండల నాయకులు నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు.