అసలే రోజా. అందులోకి నిలువెల్లా ఆగ్రహంతో ఊగిపోయే వేళ.. ఆమెను ఆపటం ఎవరికి మాత్రం సాధ్యం. బుల్లెట్ల లాంటి మాటలతో విరుచుకుపడిన ఆమె ఏపీ అధికారపక్ష నేతలపై విమర్శల వర్షం కురిపించారు. ఇక.. బాబు పేరెత్తితేనే మండిపడే ఆమె.. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు చేస్తున్న దీక్ష నేపథ్యంలో తిట్ల దండకం అందుకున్నారు. మాయమాటలతో బాబు చేసే మోసాల్ని ఏకరువు పెట్టారు.
ఆంధ్రప్రదేశ్‌కు ఒక కొస వైపు ఉండే చిత్తూరు.. అందుకు పూర్తి వ్యతిరేక దిశకు ఉండే విశాఖపట్నంలో ఏపీ అధికార.. విపక్షాలు పోటాపోటీగా దీక్షలు చేస్తున్న వేళ.. రాజకీయ వాతావరణం పూర్తిగా వేడెక్కింది. అసలే వేసవి. అందుకు తోడు పొలిటికల్ హీట్ జత కలవటంతో నేతలు ఎవరికి వారు దుమ్ము దులిపేస్తున్నారు. ఈ రోజు ఉదయం (సోమవారం) ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ప్రెస్ మీట్ పెట్టి తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో రంగంలోకి దిగారు రోజా.
తమ అధినేతపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన యనమలను తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. పనిలో పనిగా ఏపీ ముఖ్యమంత్రిపైనా ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రోజా మాటల్ని యథాతధంగా చెప్పేస్తే ఎఫెక్ట్ మిస్ కాకుండా ఉంటుంది.
ఆమె ఏమన్నారంటే..
= రాజధానికి.. పోలవరం ప్రాజెక్టుకు జగన్ అడ్డంకి అని యనమల చెబుతున్నారు. కానీ ఆయనను నేనే ఒక ప్రశ్న అడుగుతున్నా. ఇన్నాళ్లు మీరు పెద్దవారని గౌరవం ఇచ్చాం. ఒక ఆర్థికమంత్రిగా ఉండి రెవెన్యూ లోటును పూడ్చలేని నువ్వు ఒక మంత్రివా అని అడుగుతున్నా.
= చేతకాని దద్దమ్మవు నువ్వు - జగన్ గురించి మాట్లాడుతావా? ఈ రోజు జీఎస్టీ కౌన్సెల్ లో ఓ మెంబర్ గా ఉన్న యనమల నష్టాల్లో ఉన్న ఏపీకి జీఎస్టీ మినహాయింపులు తీసుకురాలేకపోయారు. నువ్వో చేతకాని దద్దమ్మవు.. అలాంటి నువ్వు జగన్ గురించి మాట్లాడుతావా?
= కేసుల గురించి జగన్ ప్రతి శుక్రవారం వెళ్తున్నాడని మాట్లాడుతున్నారు. ఆయన ఏ తప్పు చేయలేదు కాబట్టి ఎప్పుడు పిలిచినా కోర్టుకు వెళ్తున్నారు. చేతకాని దద్దమ్మలు.. మీ దోపిడీని కేంద్రం బయటకు తీస్తుంటే చంద్రబాబు, లోకేష్, నువ్వు (యనమల) నీ మంత్రులు తప్పు చేశారు కాబట్టి ఎక్కడ బీజేపీ కేసులు పెడితే జైల్లో కూర్చుంటామో అనే భయంతో ఆ పార్టీతో లాలూచీపడి మీ ఎంపీలతో రాజీనామా చేయించని చేతకాని దద్దమ్మలు మీరు.
= రైతుల స్వప్నమైన పోలవరం మేం ఆపుతామా? చంద్రబాబు గతంలో అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లు పోలవరం ఎక్కడుందో తెలియదు. రైతుల కలను నిజం చేయాలని వైఎస్ హయాంలో పోలవరం నిర్మాణానికి పూనుకున్నారని మర్చిపోయారా?
= కేంద్రం కట్టాల్సిన జాతీయ ప్రాజెక్టును కాంట్రాక్టులు.. కమీషన్ల కోసం మీరు తీసుకున్నారు. మీరు చేసిన దోపిడీ కేంద్రం గుర్తించి.. ఆ ప్యాకేజీల్లో మీ బినామీలు దోచుకున్న దానిని బయటకు తీస్తుంటే మేం ఆపామని అంటారా? సిగ్గులేకుండా మమ్మల్ని అంటారా? మాపై ఆరోపణలు చేసేందుకు సిగ్గులేదా?
= మీరు అన్నింట్లో దోచుకుంటున్నారని.. మీ తప్పుల వల్ల అన్నీ ఆగిపోతున్నాయని.. వాటిని వైసీపీ పైకి నెడుతారా? మీది చేతకానితనం. మీకు దోచుకోవడానికి, దాచుకోవడానికే సమయం సరిపోవడం లేదు. రాజధానికి జగన్ అడ్డుపడుతున్నారని మంత్రి యనమల రామకృష్ణుడు చెబుతున్నారు. ఆయనకు వయస్సు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు.
= ఇంకొకడు ఉన్నాడు ఈ కేబినెట్లో. అతనే.. దేవినేని ఉమ... ఆయన నిన్న సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి మోడీ మట్టి, నీరు తీసుకొచ్చి ఇస్తే ఎలా తీసుకున్నారని ప్రశ్నించడం విడ్డూరంగా ఉంది. మోడీ మట్టి, నీళ్లు ఇచ్చినప్పుడు నిలదీయలేని దద్దమ్మ జగన్ అని దేవినేని చెప్పారు. కానీ ఆ మట్టి, నీళ్లు తీసుకున్న దద్దమ్మలు ఎవరు?
= అప్పుడు ఈ దద్దమ్మలు వాటిని ఎందుకు తీసుకున్నారు? ఇప్పుడు సిగ్గులేకుండా జగన్ పైన విమర్శలు చేస్తున్నారు. మోడీ మట్టీ, నీళ్లు ఇచ్చినప్పుడు చంద్రబాబు అందుకున్నారు. అప్పుడు మాట్లాడని మంత్రులు ఇప్పుడు గాడిదలు కాస్తున్నారా? అదే మట్టీ, నీళ్లు హెలికాప్టర్‌లో చంద్రబాబు చల్లుతుంటే ఈ మంత్రులు గాడిదకు పళ్లు తోముతున్నారా?
= మోడీ మట్టి నీరు ఇస్తే అందుకున్న దద్దమ్మ చంద్రబాబు అయితే, చూస్తున్న దద్దమ్మలు టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు. నాడు వీళ్లు ఎందుకు అపలేదు?
= ఇంకా సిగ్గుచేటు ఏమిటంటే ఏడీఆర్ ఇచ్చిన రిపోర్టులో మహిళల మీద అట్రాసిటీ కేసులున్న ఐదుగురిలో ముగ్గురు ఎమ్మెల్యేలు.. ఇద్దరు మంత్రులు.. వారంతా ఏపీ నుంచి.. అది కూడా తెలుగుదేశం పార్టీలో ఉండటం సిగ్గుచేటు. అందులో ఒక మంత్రి దేవినేని ఉమ. మహిళల మీద అఘాయిత్యాలు చేస్తూ.. ఆరాచకాలు చేస్తూ బతుకుతున్న ఇతనికి రాజీనామా చేయకుండా జగన్ గురించి మాట్లాడే అర్హత ఉందా?
= రాజకీయ కక్షసాధింపుగా కేసులు వేసి జగన్ ఏదో తప్పు చేసినట్లు నేరస్తుడు అన్నట్లు మాట్లాడుతున్నారే టైం వచ్చింది మీరు చేసిన తప్పులు - పాపాలు పండుతాయి.
= 'ఏదైతే లోకేష్ చేసిన నోట్ల మార్పిడి కుంభకోణం గానీ ఓటుకు నోటు కేసు గానీ రాజధాని భూముల్లో మీరు దోచుకున్న ఏ ఒక్క కేసు కనుక విచారణకు వచ్చినా జీవితాంతం జైల్లో ఉంటారు చంద్రబాబు నాయుడు... నువ్వు నీ కేబినెట్ నీ కొడుకుస.
= చంద్రబాబు చేస్తోంది పోరాటం కాదు.. పబ్లిసిటీ ఆరాటం. ఎంతటివాడితోనైనా ప్రజల కోసం పోరాడే వీరుడు - దమ్మున్న నేత జగన్. 'జగన్ అనే నేను' కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారు.