వైసీపీ ఎమ్మెల్యే రోజా టీడీపీ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. తను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గంలో నగరి బూత్ కమిటీ సమావేశానికి హాజరై ఆమె మాట్లాడారు. టీడపీ పై ఘాటు విమర్శలు చేశారు. నియోజకవర్గంలో టీడీపీ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఎమ్మెల్యే రోజా విమర్శించారు. నగరి వైద్యశాల వద్ద బస్సు షెల్టర్ నిర్మాణం - తాగునీటి ఆర్వో ప్లాంట్ నిర్మాణానికి, మండలంలో ఎంపీ విజయసాయి రెడ్డి నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి టీడీపీ సర్పంచ్ లు అనుమతి ఇవ్వడం లేదని.. పుత్తూరు మండలంలోనూ ఇదే సమస్యగా ఉందని తెలిపారు.
ఇక రోజా చంద్రబాబుపై కూడా విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదా విషయాన్ని బంగాళఖాతంలో కలిపిన సీఎంగా బాబు పేరు తెచ్చుకున్నాడని ఎద్దేవా చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అవినితీ ఏపీలో జరుగుతోందని.. ఇది చంద్రబాబు ఘనతే అన్నారు. ఎమ్మెల్యేలకు ప్రభుత్వం నిధులు కేటాయించకపోయినా తన వంతు ప్రజలకు సాయం చేయడం తనకెంతో గర్వంగా ఉందని చెప్పారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అయిన తనకే టీడీపీ సర్పంచ్ లు అభివృద్ధి కార్యక్రమాలకు అనుమతులు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని.. టీడీపీ నేతల వైఖరి దీన్ని బట్టి అర్థమవుతోందని రోజా మండిపడ్డారు. ఇక టీడీపీ ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో వైసీపీ ఎంపీ విజయసాయి ఎంపీ నిధులతో తాను అభివృద్ధి చేస్తున్నానని చెప్పి టీడీపీని ఇరకాటంలోకి నెట్టారు.