డబ్బులు అడిగితే చెట్టుకు కట్టేయండి: వైసీపీ ఎమ్మెల్యే
ఈ మధ్యకాలంలో వైసీపీ నేతల వ్యాఖ్యలు సంచలనమవుతున్నాయి. ఇటీవలే డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. సర్వే నంబర్లు కూడా రెవెన్యూ అధికారులు డబ్బులకు ఆశపడి మారుస్తున్నారని.. కలెక్టర్, జగన్ తపన ఫలించడం లేదని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చేసిన వ్యాఖ్యలు ఏపీ సర్కార్ ను ఇరుకునపెట్టాయి.. రెవెన్యూ డిపార్ట్ మెంట్ కు పాదాభివందనం చేస్తానని.. మీరు డబ్బుకు, మందుకు అలవాటు పడితే రెవెన్యూ వ్యవస్థలో మార్పు తీసుకురాలేమన్నారు.
ఈ విషయం మీరు సీఎంకు చేరవేస్తే నన్ను మంత్రి పదవికి కూడా వద్దంటారని.. ఈ నిజాలు వెల్లడించవద్దని కోరారు. తన నీతి నిజాయితీ చూసే జగన్ ఈ పదవి ఇచ్చారని.. నేను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని.. నారాయణ స్వామి కమీషన్లు తీసుకొని పనులు చేస్తున్నారని.. ఏ ఒక్కరు చెప్పినా సరే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. చిత్తూరు జిల్లా గుడిపాల మండలం ముట్టుకూరు పల్లెలో జరిగిన బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
చిత్తూరు జిల్లాలో డిప్యూటీ సీఎం వ్యాఖ్యల కలకలం మరిచిపోకముందే అదే చిత్తూరు జిల్లా పలమనేరు వైసీపీ ఎమ్మెల్యే వెంకటగౌడ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పథకాల కోసం అధికారులు, నేతలు ఎవరైనా డబ్బులు అడిగితే వారిని చెట్టుకు కట్టేయాలని వెంకట గౌడ అన్నారు. చెట్టుకు కట్టేసిన తర్వాత పోలీసులు, తనకైనా సమాచారం ఇవ్వాలని సూచించారు. అలాంటి వారిని ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టదని అన్నారు.
నియోజకవర్గంలో ఇళ్ల స్థలాల కోసం లబ్ధిదారుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని విపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే వెంకటగౌడ విమర్శించారు. ఒకవేళ అలాంటి ఘటనలు ఉంటే తనకు ఫిర్యాదు చేయాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలన్న ధృడ సంకల్పంతో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నారని అన్నారు.