గుట్కా విషయంలో నాకు సంబంధం లేదు : వైసీపీ ముస్తఫా

Update: 2020-07-20 10:50 GMT
గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా గౌస్ పొగాకు గోడౌన్ లో   గుట్టు చప్పుడు కాకుండా తయారవుతున్న అక్రమ గుట్కా దందాను పోలీసులు రట్టు చేసారు. ఎమ్మెల్యే ముస్తఫా గౌస్ పొగాకు గోడౌన్ లో  గుట్కా తయారు అవుతుంది అని తెలుసుకున్న పోలీసులు ఆదివారం గొడౌన్లలో హఠాత్తుగా తనిఖీలు నిర్వహించిన పోలీసులు భారీ సంఖ్యలో  గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. గుంటూరుకు సమీపంలోని పెదకాకానీ మండలం కొప్పురావూరు సమీపంలోని గోదాముల్లో  కొద్ది రోజులుగా అక్రమంగా పెద్ద ఎత్తున గుట్కా తయారీ చేస్తున్నట్లుగా  పక్కా సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఆదివారం సదరు గోదాముల్లో ఆకస్మిక సోదాల్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా సుమారు కోటి రూపాయల విలువైన గుట్కా సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే పాన్ మాసాలా తయారు చేయడం కోసం సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి పేరుతో అనుమతులు తీసుకుని గోడౌన్‌లో నడుపుతున్నారు. కాగా పాన్ మాసాలాతో పాటు ‘టెంపర్’ పేరుతో గుట్కాను తయారు చేసి ఇతర ప్రాంతాలకు అక్రమంగా రవాణా చేస్తున్నారు.  అధికార పార్టీ ఎమ్మెల్యేకు చెందిన గోదాముల్లో ఇంత భారీగా గుట్కా దందా బయటకు రావటం సంచలనంగా మారింది. దీనిపై విపక్షాలు ప్రభుత్వం పై విమర్శలు కురిపిస్తున్నాయి.

ఈ ఘటన పై స్పందించిన ఎమ్మెల్యే ముస్తఫా గౌస్..ఆ గోడౌన్ లో గుట్కా తయారీకి తనకి ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. తనకి పొగాకు గ్రేడింగ్ గోదాంలు చాలా ఉన్నాయి అని , అందులో ఒకటి ఖాళీ అవ్వడం తో వారికీ అద్దెకి వెచ్చినట్టు తెలిపారు. అయితే , అందులో అక్రమంగా గుట్కా తయారుచేస్తున్న సంగతి తెలియదు అని అన్నారు. 
Tags:    

Similar News