వైసీపీ మైండ్ గేమ్ మొదలెట్టింది. ఎన్నికలు ఎంతో దూరంలో ఉన్నా కూడా ఏణ్ణర్ధం క్రితం స్టార్ట్ చేసిన ఆ మైండ్ గేమ్ ని ఇపుడు లాజికల్ పాయింట్ దగ్గరకు తీసుకురావాలని చూస్తోంది. అయితే దానికి టీడీపీ అధినాయకత్వం సహకారం అవసరం. వైసీపీ ట్రాప్ లో పడితే మాత్రం కచ్చితంగా అదే జరుగుతుంది, అలా జరగాలనే అధికార పార్టీ ఆలోచిస్తోంది అని అంటున్నారు.
ఇంతకీ వైసీపీ మైండ్ గేమ్ ఏంటి, దానికి టీడీపీ ఎలా ప్రభావితం అవుతోంది అనడానికి కుప్పం అసెంబ్లీ సీటునే అంతా చూపిస్తున్నారు. కుప్పంలో చంద్రబాబుదే విజయం. ఆయన ఏకపక్షంగా ఏడు ఎన్నికల్లో విజయ పతాక ఎగరేశారు. మరి ఎనిమిదవసారి కూడా అదే జరుగుతుంది, జరగాలి. కానీ అక్కడే వైసీపీ మైండ్ గేమ్ స్టార్ట్ చేసింది.
ఈసారి కుప్పంలో ఫ్యాన్ పార్టీ గెలుస్తుందని గత ఏడాదిన్నరగా అదే పనిగా వైసీపీ నేతలు చెబుతూ వస్తున్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో ఏకపక్షంగా వైసీపీ గెలవడంతో ఆ మైండ్ గేమ్ ఊపందుకుంది. దానికి ముందు 2019 ఎన్నికల్లో కూడా చంద్రబాబు మెజారిటీని బాగా తగ్గించామని చెప్పుకున్నారు. ఈ నేపధ్యంలో నుంచి చూస్తే 2024 ఎన్నికల్లో ఏం జరుగుతుంది అన్న ఉత్కంఠ ఎటూ ఉంటుంది. అయితే చంద్రబాబుకు టీడీపీకి కంచుకోట లాంటి కుప్పం జనం ఒక్కసారిగా ఆయనకు హ్యాండ్ ఇచ్చేస్తారా అన్నదే ఒక చర్చ.
అవతల వైపు ఉన్న చంద్రబాబు ఏమైనా సామాన్యుడా. ఆయన ముమ్మారు సీఎం కుర్చీ ఎక్కారు. నాలుగు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న నాయకుడు. అలాంటి బాబును కుప్పంలో ఓడిస్తామని వైసీపీ అంటోంది. జగన్ నుంచి మంత్రుల నుంచి మొదలుపెడితే క్యాడర్ దాకా అందరిదీ అదే మాట. దాంతో బాబు ఓడుతారా లేదా అన్నది పక్కన పెడితే ఏపీ అంతా కుప్పం గురించి మాట్లాడుకునే పరిస్థితిలోకి వైసీపీ తెచ్చింది. ఇలా మైండ్ గేమ్ లో సగం వరకూ సక్సెస్ అయింది.
దానికి బాబు కూడా పడ్డారా అంటే ఆయన ఇదివరకు కుప్పం వెళ్ళిన సందర్భాలు పెద్దగా లేవు. కానీ ఇపుడు నెలకోసారి అక్కడికి వెళ్తున్నారు. దాంతో ఇది చాలదా మా దెబ్బ అంటోంది వైసీపీ. అయితే బాబు వెళ్లకపోతే గెలవరా అంటే అదేమీ లేదు, అయినా ఎందుకైనా మంచిదని తన బలాన్ని మరింతగా పటిష్టం చేసుకునేదుకు బాబు కుప్పం టూర్లు వేస్తున్నారేమో. పైగా ఆయన ఇపుడు విపక్ష నేత. కాబట్టి వీలు దొరికింది కాబట్టి వెళ్తున్నారేమో అనుకోవచ్చు.
కానీ వైసీపీ మాత్రం అదంతా కాదు వైసీపీకి జడిసే బాబు కుప్పం టూర్లు పెంచేశారు అంటోంది. ఇపుడు మరో కొత్త మైండ్ గేమ్ మొదలైంది. బాబు రెండవ సీటు కోసం చూస్తున్నారు అని. నిజంగా అలా జరుగుతోందా. బాబు ఆ ఆలోచనల్లో ఉన్నారా లేదా అన్నది పక్కన పెడితే అది మీడియాలో కధనాల దాకా వచ్చేసింది. లేటెస్ట్ గా ఒక ఆంగ్ల పత్రికలోనూ సెకండ్ సీటు మీద బాబు చూపు అని రాసుకొచ్చారు. మరి నిప్పు లేకపోయినా పొగ పుట్టించే రాజకీయాల్లో బాబు అలా చేయకపోయినా వార్తలు రావచ్చు అని తమ్ముళ్ళు అంటున్నారు.
ఇక ఈ కధనాన్ని వెల్ కమ్ చేస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బాబు రెండవ సీటుకు పోటీ చేయడంలో తప్పు లేదు, ఎన్టీయార్ కూడా ఎపుడూ అలాగే చేసేవారు. ఆ మధ్య రాహుల్ గాంధీ కూడా రెండు సీట్లకు పోటీ చేసి ఒకటి ఓడారు అంటూ ట్వీట్ చేస్తూ మసాలా పెంచారు. అంటే చంద్రబాబు రెండవ సీటుకు పోటీ చేయాలన్న కోరిక అయితే వైసీపీకి బాగానే ఉంది. సరే బాబు అలాగే అనుకుని ఎందుకైనా సేఫ్ అని పోటీ చేశారంటే ఇంకేముంది వైసీపీ మైండ్ గేమ్ పూర్తిగా పారినట్లే అని అంటున్నారు.
అదేలా అంటారా. చంద్రబాబుకే ఓటమి భయం పట్టుకుని కుప్పంతో పాటు రెండవ సీట్లో పోటీకి దిగితే ఇక టీడీపీ వచ్చే ఎన్నికల్లో ఏమి గెలుస్తుంది అని వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారానికి దిగడం ఖాయం. అలా జరిగితే ఎంత కాదనుకున్న పార్టీ జనాలు సాదర జనాలూ కూడా ఎంతో కొంత దాన్ని నమ్మడమూ ఖాయం. అలా టీడీపీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని, అవ్వాలన్నదే వైసీపీ ఆడుతున్న మైండ్ గేమ్ లెక్క.
మరి ఏ గేమ్ లాజికల్ కంక్లూషన్ కి వస్తుందా లేదా. అలా రావాలని వైసీపీ చేస్తున్న ప్రయత్నాలకు బాబు కూడా సహకరిస్తారా. అంటే రెండవ సీటుకు పోటీ చేసి అన్న మాట. ఏది ఏమైనా కుప్పంలోనే తేల్చుకుంటానని బాబు అంటేనే ఇక్కడ వైసీపీ మైండ్ గేమ్ ని బద్ధలు కొట్టినట్లు. లేకపోతే మాత్రం బాబు సహా టీడీపీ గట్టిగా ఇరుక్కున్నట్లే అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.